BREAKING: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్‌ EFLU క్యాంపస్‌లో ఉద్రిక్తత..!

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ(EFLU) క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనకు దిగారు. నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు.

New Update
BREAKING: టెన్షన్.. టెన్షన్.. హైదరాబాద్‌ EFLU క్యాంపస్‌లో ఉద్రిక్తత..!

హైదరాబాద్‌ ఇఫ్లూలో ఉద్రిక్తత నెలకొంది. లైంగిక వేధింపుల బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు స్టూడెంట్స్. నిరహార దీక్షకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టి కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత నెల18న ఇఫ్లూలో పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన జరిగింది. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని గతంలో విద్యార్థుల ఆందోళన చేశారు.

హామీ ఇచ్చారు.. తర్వాత పట్టించుకోలేదు:
నిందితులపై చర్యలు తీసుకుంటామని వీసీ హామీ ఇచ్చారు. 18 రోజులు గడిచినా నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఇఫ్లూలో విద్యార్థుల నిరసనకు దిగారు. క్యాంపస్​లో విద్యార్థులకు రక్షణ కల్పించడంలో వైస్​చాన్స్​లర్, రెక్టార్ ఫెయిల్​ అయ్యారంటూ నినాదాలు చేశారు.

Also Read: విజయశాంతికి షాక్ ఇచ్చిన బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే!

చర్యలు ఎందుకు తీసుకోలేదు?
తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు స్టూడెంట్స్. లైంగిక వేధింపులపై ఆరోపణలపై దర్యాప్తు చేయకపోవడంపై మండిపడుతున్నారు. ఇవాళ(నవంబర్ 6) నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన EFLU విద్యార్థుల్లో ఏడుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్టోబరు 18 లైంగిక వేధింపుల ఘటన తర్వాత వైస్-ఛాన్సలర్ లేఖను చూపిస్తూ నిరసనకు దిగారు. అసలు కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు.

కాలేజీ అధికారులు ఫిర్యాదు చేశారా?
క్యాంపస్‌లో అశాంతి సృష్టించారని విద్యార్థులు ప్రయత్నిస్తున్నారని ఇటీవల ప్రొక్టర్ శాంసన్ నిందించాడు. ఆయన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటి వరుకు ఎవరూ అరెస్టు కానప్పటికీ.. నిరసనలు చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారంటూ స్టూడెంట్ సంఘాలు మండిపడతున్నాయి. విద్యార్థులతో పాటు కొంతమంది ఉపాధ్యాయులపై నిందలు మోపడానికి విశ్వవిద్యాలయ పరిపాలన నిరంతరం ప్రయత్నిస్తోందని ఫైర్ అవుతున్నారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న విద్యార్థులు కేవలం EFLUకి చెందిన వారే కాదని తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU), ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు కూడా నిరసనలో ఉన్నట్లు సమాచారం. క్యాంపస్‌ ప్రధాన గేటు ఎదుట మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిరసనలో పాల్గొన్నారు. EFLU వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది మీడియాతో సహా ఎవరినీ క్యాంపస్‌లోకి అనుమతించలేదు.

Also Read: బీజేపీ మేనిఫెస్టో లీక్.. సంచలన విషయాలివే

Advertisment
తాజా కథనాలు