Sania Mirza:భారత టెన్నీస్ సంచలనం సానియా మీర్జా పుట్టినరోజు నేడు.

భారత టెన్నీస్ లో ఒకే ఒక్క ధృవతార సానియా మీర్జా. మన దేశం ఆటకాని టెన్నీస్ లో నంబర్ వన్ క్రీడాకారిణిగా వెలుగొందిన సానియా పుట్టినరోజు ఈరోజు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఆటకు స్వస్తి చెప్పిన ఈమె ఇండియాలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Sania Mirza:భారత టెన్నీస్ సంచలనం సానియా మీర్జా పుట్టినరోజు నేడు.
New Update

టెన్నీస్...ఇది భారతదేశపు ఆట కాదు. అమెరికా, యూరోపియన్ దేశాలు ఎక్కువగా ఆడే ఆట. అత్యత్తుమ ఆటగాళ్ళు కూడా అక్కడి నుంచే ఉన్నారు. మన దేశం నుంచి టెన్నీస్ ప్లేయర్లు ఉన్నా ఇంటర్నేషనల్ గా రాణించినవారు చాలా తక్కవు. మగవాళ్ళల్లో మన టెన్నీస్ ఖ్యాతిని మెరుగుపర్చింది పేస్-భూపతి ద్వయం మాత్రమే. అమ్మాయిల్లో అయితే జీరో. అప్పుడు వచ్చింది ఒక గెలుపు కెరటం. టెన్నిస్ బాల్ లా పైపైకి ఎగిరింది. భారతదేశ ఖ్యాతిని మరింత పెంచింది. ఆమే సానియా మీర్జా.

Also Read:ఈరోజు మ్యాచ్‌లో టాసే హీరోనా? వాంఖడే రికార్డులు ఏం చెబుతున్నాయి?

భారత టెన్నిస్ సంచలనం సానియా పుట్టినరోజు నేడు. నేటితో ఈమె 37 ఏళ్లు పూర్తి చేసుకుంది. సానియా మీర్జా 15 నవంబర్ 1986న ముంబైలో హైదరాబాదు ముస్లిం తల్లిదండ్రులైన ఇమ్రాన్ మీర్జా, నసీమాకు జన్మించారు. ఈమె పుట్టిన కొద్దికాలానికే తమ కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. వీరు మతపరమైన సున్నీ ముస్లిం కుటుంబంలో పెరిగారు. సానియా హైదరాబాద్‌లోని నాసర్ స్కూల్‌లో చదివింది. తర్వాత హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీ తీసుకుంది.

సానియా ఆరేళ్ల వయసులో టెన్నిస్‌ ఆడటం ప్రారంభించింది. సానియా తండ్రి కూడా టెన్నీస్ ప్లేయర్. ఈమె మొదట గురువు తన తండ్రే. దీని తర్వాత రోజర్ ఆండర్సన్ దగ్గర శిక్షణ పొందింది. మీర్జా జూనియర్ ప్లేయర్‌గా పది సింగిల్స్ , పదమూడు డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. అప్పుడే 2003 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్ బాలికల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. దీని తర్వాత 2003 US ఓపెన్ బాలికల డబుల్స్‌లో సనా భాంబ్రీతో సెమీఫైనల్‌కు చేరుకుంది. మీర్జా 16 ఏళ్ల వయసులో 2002లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా టెన్నిస్‌లో మహిళల బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. సానియా తన మొత్తం కెరీర్‌లో ఆరు ఇంపార్టెంట్ టైటిళ్లను గెలుచుకుంది. ఇందులో మూడు మహిళల డబుల్ టైటిల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి. ఉమెన్స్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ నెగ్గిన సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ ను సొంతంత చేసుకుంది. ఉమెన్ సింగిల్స్‌లో చాలా కాలం నంబర్ 1 స్థానంలో కొనసాగింది.

భారత్లో టెన్నీస్‌కు అంతగా ఆదరణ లేనప్పుడు.. అసలెవరూ పట్టించుకోనప్పుడు..భవిష్యత్‌ ఎలా ఉంటుందో తెలియనప్పుడు..టెన్ని్‌స్‌ను కెరీర్‌గా ఎంచుకొంది సానియా మీర్జా. ఎన్నో ఆటంకాలు అధిగమించి.. అద్భుత పోరాట స్ఫూర్తితో తాను ఎదగడమే కాకుండా.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది ఈ టెన్నిస్‌ సూపర్‌స్టార్‌. సానియా ఈ ఏడాదిలోనే ఫ్రిబ్రవరిలో తన కెరీర్‌లో చివరి అంకాన్ని ముగించింది. దుబాయ్‌ ఓపెన్‌ లో 36 ఏళ్ళ వయసులో తన చివరి ఆట ఆడింది. అమెరికా ప్లేయర్ మాడిసన్‌ కీస్‌తో కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ ఆడింది. ఇందులో మొదట మ్యాచ్‌లో ఓడిపోయిన సానియా తన ఆటకు స్వస్తి పలికింది.

సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్‌లోనే గ్రాండ్ గా జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

#sania-mirza
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe