Yellow Alert: దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైఅలెర్ట్ లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ!

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

New Update
Yellow Alert: దేశంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైఅలెర్ట్ లో తెలంగాణ, ఏపీ, ఢిల్లీ!

Temperatures Fallen Down: చలికాలం షురూ అయింది. దేశంలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో చలి తన పంజా విసురుతోంది. ప్రజలు చలి పులికి గజగజ వణికిపోతున్నారు. చెద్దర్లు, స్వేటర్లకు గిరాకీ పెరిగింది. ఇదిలా ఉండగా ఇప్పటికే వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు చలి తీవ్రత పెరగడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పిల్చికోవడానికి కూడా అక్కడి ప్రజలు నానాతంటాలు పడుతున్నారట. శ్వాసకోశ సమస్యతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. రోడ్లపై దట్టమైన పొగ మంచు కూరుకుపోవడంతో రాకపోకలకు అంతరం ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమయం 9 దాటినా సూర్యుడి జాడ కనిపించడం లేదు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

ALSO READ: ‘భారత్ న్యాయయాత్ర’ పేరుతో రాహుల్ పాదయాత్ర

తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే సీన్...

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోనూ చలి కనికరం చూపడం లేదు. తెల్లారి లేచి ఎక్కడ చూసిన చలి మంటలతో కూర్చున్నా జనాలే దర్శనమిస్తున్నారు. చలి తీవ్రతతో పనులు మానుకొని చలి మంటల వద్ద ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఉదయంతో పాటు రాత్రి సమయాల్లో చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రమంతటా పొగమంచు వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు తప్పకుండా ఇళ్లలోనే ఉండాలని పేర్కొన్నది. కాలుష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యత చాలావరకూ తగ్గిందని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టంచేసింది.

ALSO READ: ఓటుకు రూ.3,000.. మహిళలకు పట్టు చీర!

పొగమంచు ఎఫెక్ట్.. వాహనాలు ఢీ..

పొగమంచు కారణంగా విశాఖ కొమ్మాది కూడలిలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు, ట్యాంకర్‌, మూడు కార్లు ఢీకొని ప్రమాదం జరిగింది. అయితే.. ఈ ఘటనలో ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా కొమ్మాది కూడలిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు.

Advertisment
తాజా కథనాలు