Nizamabad: గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

బోధన్ పట్టణంలోని ఆదివారం గణేష్‌ ఉత్సవ నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCP S.జై రామ్, విశిష్ఠ అతిథిగా ఇంచార్జ్ ఏసీపీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. గణేష్‌ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ గణేష్‌ ఉత్సవాలు, మిలాద్‌ ఉన్‌ నబీ శాంతి యుతంగా జరుపుకోని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

New Update
Nizamabad: గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

ఈసారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఈనెల (సెప్టెంబర్) 19న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. 28న నిమజ్జనం ఉంది. తే అదే రోజు మిలాద్ ఉన్ నబీ పండుగ రావటంతో ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. నిమజ్జనం అదే రోజు కావటంతో హిందువులు వినాయక శోభాయాత్రలు నిర్వహిస్తారు. రెండు పండుగలు ఒకే రోజు రావటంతో శాంతి భద్రతల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు ఉత్సవాలల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు పోలీసులు.

నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకేరోజు వస్తున్న దృష్ట్యా హిందూ ముస్లిం ఒకరికొకరు సహకరించుకోనీ శాంతియుతంగా జరుపుకోవాలని బోధన్ పట్టణంలో సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశాన్ని స్థానిక ఎన్ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా DCP S.జై రామ్, విశిష్ఠ అతిథిగా ఇంచార్జ్ ఏసీపీ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ మాసంలో రానున్న వినాయక చవితి నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు ఒకేరోజు వస్తున్న దృష్ట్యా హిందూ ముస్లిం ఒకరికొకరు సహకరించుకోనీ శాంతియుతంగా నిర్వహించుకోవాలని సమావేశ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల నుంచి పలువురు నాయకులు అంతా శాంతియుతంగా నడిచే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే పండగల దృష్ట్యా వసతుల కొరకై మున్సిపల్ అధికారులకు తెలుపగా ఆర్డీవో ఎంఆర్‌వో మున్సిపల్ కమిషనర్ సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

గణేష్‌ మండప నిర్వాహకులు విగ్రహాలు ఏర్పాటు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు మీద మండపాలను ఏర్పాటు చేయ కూడదన్నారు. గణేష్‌ మండపాల సమాచారాన్ని పోలీస్‌ అధికారులకు తెలపాలన్నారు. ప్రతీ మండపం వద్ద పాయింట్స్‌ బుక్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది, పోలీస్‌ అధికారులు తరచూ వచ్చి తనిఖీ చేస్తామన్నారు. మండపాల దగ్గర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పూర్తి బాధ్యత మండప నిర్వహకులే వహించాలి. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు పూర్తి బాధ్యతలను నిర్వాహకులు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు