టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బంద్‌కు జనసేన మద్దతు తెలిపింది. ఉమ్మడి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా విద్యాసంస్థలు మాత్రమే స్వచ్ఛందంగా మూసివేశారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి డిపోల నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్ సర్వీసులు కొనసాగుతున్నాయి.
This browser does not support the video element.
కొన్ని ప్రాంతాలలో మాత్రమే షాపులు మూసివేసివేశారు. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో పాక్షిగా బంద్ కొనసాగుతోంది. షాపులు మూసివేశారు. జిల్లాలో అమలాపురం, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, రావులపాలెం, కొత్తపేటలో బంద్ కొనసాగుతోంది. ముమ్మడివరంలో, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట, రామచంద్రపురంలో స్వచ్ఛందంగా దుకాణదారులు, ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు వెళ్ళాలా..? లేదా..? అనే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అల్లూరి జిల్లా, రంపచోడవరం, అడ్డతీగల ఏడు మండలాల్లో స్వచ్ఛందంగా యజమానులు షాపులు మూసి వేసివేశారు.
This browser does not support the video element.
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్‌కు అనుమతి లేదని జిల్లా ఎస్పీలు తెలిపారు. టీడీపీ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలకు, ధర్నాలకు అనుమతి లేదని పోలిసులు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు బలవంతంగా మూయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో మేఘావృతమై చిరు జల్లులతో కూడిన వాతావరణం ఏర్పాడింది. కొన్నిప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.
This browser does not support the video element.