షారూక్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 129 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని షారూక్ ఘనంగా ప్రకటించుకున్నాడు. అయితే ఇండియాలో మొదటి రోజుకే వంద కోట్లు సాధించిన సినిమా జవాన్ ఒక్కటేనా. అస్సలు కాదు. జవాన్ కంటే ముందు చాలా ఉన్నాయి. కాకపోతే హిందీ సినిమాల్లో మొదటి రోజుకే వంద కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా జవాన్ అవతరించింది.
షారుక్ ఖాన్ తన తాజా చిత్రం జవాన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ ఓపెనింగ్‌లను నమోదు చేసింది, ఈ సంవత్సరం ప్రారంభంలో అతను పఠాన్‌తో నెలకొల్పిన అత్యధిక డే-1 కలెక్షన్ రికార్డును జవాన్ అధిగమించింది. కింగ్ ఖాన్ స్టార్‌డమ్ కు, అట్లీ డైరక్షన్ తోడవ్వడంతో సినిమా పెద్ద హిట్టయింది.
జవాన్ హిందీ వెర్షన్‌కి ఇండియాలో మొదటి రోజు 65 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ వసూళ్లు చూసకుంటే.. 100 కోట్లు గ్రాస్ దాటింది. అయితే లిస్ట్ లో జవాన్ కంటే ముందు కొన్ని సినిమాలున్నాయి. ఆ లిస్ట్ మీ కోసం..
1. బాహుబలి 2
2. సాహో
3. ఆర్ఆర్ఆర్
4. కేజీఎఫ్ 2
5. పఠాన్
6. ఆదిపురుష్
7. జవాన్
ఇలా జవాన్ తో కలిపి మొదటి రోజే వంద కోట్లు కలెక్ట్ చేసిన సినిమాల సంఖ్య 7కు చేరింది. ఇందులో ప్రభాస్ సినిమాలే ఎక్కువగా ఉండడం విశేషం. ఇక రాజమౌళి కోణంలో చూసుకుంటే 2 సినిమాలున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అట్టర్ ఫ్లాప్ అయిన ఆదిపురుష్ కు కూడా మొదటి రోజు వంద కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక ఓవరాల్ వసూళ్లలో జవాన్ సినిమా ఏ స్థానంలో నిలబడుతుందో చూడాలి.