SANGAREDDY: స్వయంభుగా వెలిసిన ఆ విగ్నేశ్వరుడికి ఎన్నో మహిమలు By Vijaya Nimma 18 Sep 2023 in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి రోజురోజుకు పెరుగుతూ.. స్వయంభుగా వెలిసినటువంటి ఆ విగ్నేశ్వరుడికి ఎన్నో మహిమలు ఉన్నాయి. వెలసినప్పుడు అడుగున్నర ఎత్తులో ఉన్న లంబోదరుడు.. రోజురోజుకు పెరుగుతూ ఆరు అడుగులకు చేరుకున్నాడు. కోరుకున్న కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే స్థానికులే కాకుండా పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విజ్ఞేశ్వరుని దర్శించుకుని కోరికలు తీర్చుకుంటారు. ఎన్నో మహిమలున్న రేజింతల్ వినాయకుడి విశేషాలు ఇప్పుడు చూద్దాం. స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక దేవాలయం పురాతనమైన దేవాలయం. ఈ ఆలయానికి తెలంగాణ నలుమూల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. 224 సంవత్సరాలకు క్రితం ఇక్కడ లంబోదరుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. అడుగున్నర ఎత్తులో ఉన్న విగ్నేశ్వరుడు స్వయంభుగా వెలిసి రోజు రోజుకు పెరుగుతూ ఇప్పుడు ఆరు అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. 40 రోజులలోనే నెరువేతాయని భక్తుల నమ్మకం ప్రతి మంగళవారం ఇక్కడి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .అలాగే ప్రతి నెల పౌర్ణమి అయినా మూడు రోజులకు వచ్చే సంకట చతుర్థి రోజు వేలాది భక్తులు ఈ స్వామి వారిని దర్శించుకొంటారు. ఈ రోజు దర్శించుకొంటే వారు కోరుకున్న తమ కోరికలు 40 రోజులలోనే నెరువేతాయని భక్తుల నమ్మకం. ఈ పూజలో పాల్గొనేందుకు ప్రజలు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా వస్తుంటారు. చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడి వినాయకుడి మహిమల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం గణేశుడి ఎత్తు పెరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. అత్యంత సుందరంగా ముస్తాబు ఇక.. వినాయక చవితి ఉత్సవాలకు ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేస్తారు. లంబోధరున్ని దర్శించుకునేందుకు మంత్రి హరీష్‌రావు, కేంద్ర మంత్రి భగవద్‌కు వంటి ప్రముఖులు కూడా వచ్చి దర్శించుకుంటారు. తెలంగాణ నుంచి కర్ణాటక బీదర్ వైపు వెళ్లేవారు కచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి పూజించుకుంటారు. ఏ శుభకార్యం తలపెట్టినా ఎందరో భక్తులు తొలిపూజ చెయ్యడానికి ఈ స్వామి దగ్గరకు రావడం ఈ క్షేత్రం గొప్పతనం. అందుకే ఈ సిందూరవర్ణ గణపతి భక్తజన పూజీయుడూ, ప్రేమపాత్రుడు అయ్యాడు. #sangareddy-district #rejintha #nyalkal-mandal #sri-siddhi-vinayaka-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి