Also Read: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..!
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరాలు దొరుకుతాయా? వాటి ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్..టెన్షన్ గా ఉంటున్నారు. ఇజ్రాయెల్ లో దాదాపు 6వేల మంది తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఫోన్ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!
భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచిస్తుంది. సురక్షిత ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌లో తమ వారు ఎలా ఉన్నారోనని ఇక్కడి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాల గురించి ఆరా తీస్తున్నారు.