Israel War: ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం.. బిక్కుబిక్కుమంటున్న తెలుగు ప్రజలు..! ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణంతో తెలుగు పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో తెలుగు ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Israel War: ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో సమయం చూసి ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ లోని తెలుగు పౌరులు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. Also Read: జగన్ పై దాడి చేసింది వాళ్లే.. దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించండి..! ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరాలు దొరుకుతాయా? వాటి ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్..టెన్షన్ గా ఉంటున్నారు. ఇజ్రాయెల్ లో దాదాపు 6వేల మంది తెలుగువారు ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ఫోన్ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు! భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచిస్తుంది. సురక్షిత ప్రాంతాలకు దగ్గరగా ఉండాలని అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్‌లో తమ వారు ఎలా ఉన్నారోనని ఇక్కడి కుటుంబసభ్యుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వారికి ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాల గురించి ఆరా తీస్తున్నారు. #israel-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి