Miss Teen Galaxy 2024: తెలంగాణకు చెందిన సుహాని రావు బోయిన్‌పల్లి (Suhani Rao Boinpally)మిస్ టీన్ గెలాక్సీ పోటీ UK టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. మార్చి 23న వారింగ్‌టన్ పార్ హాల్‌లో 25 మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఈ గౌరవాన్ని సాధించిన మొదటి దక్షిణాసియా అమ్మాయిగా, అత్యధిక స్కోర్‌లతో అన్ని రౌండ్‌లలో ఆధిపత్యం చెలాయించింది.
14 సంవత్సరాల క్రితం UKలోని బకింగ్‌హామ్‌షైర్‌కు మకాం మార్చిన సుహాని కుటుంబం సిద్దిపేట జిల్లాలోని తోటపల్లి గ్రామం నుండి వచ్చింది. సుహాని భరతనాట్యం నృత్య కారిణి. 'నాట్య కళా జోతి' అనే బిరుదును కలిగి ఉన్న ఆమె ప్రస్తుతం బోధన ద్వారా కళారూపాన్ని కాపాడుకోవాలనే ఆకాంక్షతో పోస్ట్ డిప్లొమాను కొనసాగిస్తున్నారు.
డాన్స్‌కి మించి, సుహాని ఆసక్తిగల డిబేటర్, నటి. భారతదేశంలో బీచ్ క్లీనప్‌లు, బయోడిగ్రేడబుల్ ప్యాడ్ డొనేషన్ క్యాంపెయిన్‌ల వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పేదరికాన్ని రూపుమాపలనేది ఆమె లక్ష్యం. ఆగస్ట్‌లో USAలోని ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరిగే గెలాక్సీ ఇంటర్నేషనల్ పేజెంట్‌లో UK తరపున సుహాని ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కిరీటం కోసం పోటీ పడుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీనేజ్ ఫైనలిస్ట్‌లతో అంతర్జాతీయ కిరీటం కోసం పోటీపడుతుంది.
Also read: తెలంగాణ వాసులకు తీపి కబురు… రెండు రోజుల పాటు వానలు!