Siddipet: కొంగర్‌కాలన్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: కోమటిరెడ్డి 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ ఇస్తే కేసీఆర్‌కు సంబంధించిన 400 కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయని అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పలు విమర్శలు చేశారు. By Vijaya Nimma 08 Sep 2023 in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి సభను విజయవంతం చేయాలని ఈనెల 17న కొంగర్ కాలన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. ఇది చారితత్మక సభ అని... కర్ణాటకలో మాదిరిగా సోనియా గాంధీ ప్రకటన చేస్తారని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కూడా 10 ఏళ్ల నుంచి బాధలో ఉన్నామని.. బంగారు తెలంగాణ పేరు నేడు బ్రతక లేని తెలంగాణగా మారిందన్నారు. రాష్ట్రంలో 5 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని విమర్శించారు. 70 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని.. ఎన్నికలు వస్తున్నాయని, దళిత బంద్, బీసీ బందు పెట్టీ వారి కార్యకర్తలకు ఇస్తున్నారు. పేద ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ని ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరు సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. జీతాలు సకాలంలో ఇవ్వక ఉద్యోగులను ఇబ్బందులు పెడ్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హోమ్ గార్డ్ రవీందర్ మరణించడం దురదష్టకరం అని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని వాపోయారు. నేడు బీఆర్‌ఎస్ ఇచ్చే 4వేల పెన్షన్ కాంగ్రెస్ హయాంలో నాలుగు వందలతో సమానమని అన్నారు. కేసీఆర్ డబ్బుల మీద ఆధారపడితే, మేము ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తామన్నారు. కేసీఆర్‌నీ ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరన్నారు. పదవికి రాజీనామా చేస్తా పార్లమెంట్ సమవేశాల్లో జమిలి ఎన్నికలు అనే చర్చ వస్తుందన్నారు. రెండు రోజుల నుండి 10 గంటల కరెంట్ కూడా రావడం లేదన్నారు. తనకి కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదు కానీ కేసీఆర్ ప్రభుత్వంపై ఉందన్నారు. తాను తెలంగాణ కోసం మంత్రి పదవినీ వదులుకున్నా నాని గుర్తు చేశారు. కేసీఆర్ 70వేల పుస్తకాలు చదివినా అన్నవ్, దళిత సీఎం ఎటుపోయింది? వెలమలకు 8 మంత్రి పదవులు ఇస్తావా..?, బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చావ్..? ముదిరాజ్‌లకు ఒక్క ఎమ్మెల్యే టికెట్‌ను కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌నీ ఇంటికి పంపేందుకు కొంగర కొలాన్ మీటింగ్ అని.. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో 15 గంటల కరెంట్ ఉంటే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీష్‌రావుకి సవాల్ చేశారు. #siddipet #komati-reddy #kongarkalan-public-meeting #should-be-a-success మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి