Balayya: పార్టీని ఎలా నడుపుదాం..!! సీన్‌లోకి బాలయ్య

ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని ఎలా నడపాలని అందరిలో టెన్షన్‌ మొదలైంది.

New Update
Balayya: పార్టీని ఎలా నడుపుదాం..!! సీన్‌లోకి బాలయ్య

పార్టీ పరిస్థితి ఏంటి..?

ఏపీలో మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబును 14 రోజులు రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్‌ జెల్‌ తరలించారు. చంద్రబాబు అరెస్ట్‌తో టీటీడీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలను షాక్‌కు గురిచేసింది. పార్టీ నాయకుడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు, బంద్‌లు అన్ని కార్యక్రమాలు చేశారు. మా నాయకుడికి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పార్టీ పరంగా టీడీపీ నేతల్లో మరో ఆందోళన మొదలైంది. పార్టీని ఎలా నడపాలని అందరిలో టెన్షన్‌ పట్టుకుంది. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న పలు విషయాలపై చర్చకు సిద్ధమైయ్యారు.

భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

పార్టీ ఎలా నడపాల అనే విషయంపై టీడీపీ కేంద్ర ఆఫీస్‌కి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలతో బాలకృష్ణ సమావేశమైయ్యారు. ఇప్పటికే యనమల, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మరికొంత మంది నేతలు పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. చంద్రబాబు జైలుకెళ్లిన నేపథ్యంలో పార్టీ పరంగా ఏం చేయాలన్న దానిపై వారు చర్చిస్తున్నారు. చంద్రబాబు జెల్‌లో ఉన్నందున టీడీపీ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో బాలకృష్ణ చర్చించనున్నారు.

భయంగా ఉంది..

మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ప్రకటించారు టీడీపీ నేతలు. అంతేకాక విశాఖ పోర్టు గెస్ట్‌హౌస్‌లో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కలిశారు. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్‌ అనంతరం జరిగిన పరిణామాలును, పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు ఎన్ని కేసులు పెట్టినా.. ఒంటరిగా పోటీ చేసినా 15 ఎంపీ సీట్లు వస్తాయని దీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ ఆరచకాలకు ప్రజలు త్వరలోనే బుద్ది చెబుతారని వారు అంటున్నారు. చంద్రబాబును జైలులో ఏమైనా చేస్తారనే అనుమానాలు టీడీపీ నేతలు వ్యక్త పరుస్తున్నారు.

వాట్ నెక్ట్స్...

ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌ ఎవరికి ఉపయోగం..? 14 రోజుల రిమాండ్‌లో ఏం చేయబోతున్నారు..? మరి టీడీపీ నేతల మాటేంటి..? పార్టీ పరిస్థితి ఏంటి..? కట్ చేస్తే సీన్‌లోకి బాలయ్య..  రాష్ట్రంలో ఏం జరగబోతోంది..?

Advertisment
తాజా కథనాలు