Salaar: ఉత్తర అమెరికాలో సలార్ సినిమా క్రేజ్..!! ఎన్ని కోట్లు అమ్ముడుపోయిందంటే..?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఉత్తర అమెరికాలో సలార్‌ సినిమా రిలీజ్ కాకముందే రికార్డు సృష్టించింది. అత్యధిక బిజినెస్ చేసిన రెండో తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ హక్కులు 40 కోట్లకు అమ్ముడు పోగా.. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు 36 కోట్లకి అమ్ముడుపోయింది.

New Update
Salaar: ఉత్తర అమెరికాలో సలార్ సినిమా క్రేజ్..!! ఎన్ని కోట్లు అమ్ముడుపోయిందంటే..?

Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఉత్తర అమెరికా(North America)లో సలార్‌(Salaar) సినిమా రిలీజ్ కాకముందే రికార్డు సృష్టించింది.  ఉత్తర అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అత్యధిక బిజినెస్ చేసిన రెండో తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ హక్కులు రూ. 40 కోట్లకు అమ్ముడు పోగా.. ఇప్పుడు సలార్ సినిమా హక్కులు రూ. 36 కోట్లకి అమ్ముడుపోయింది.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ కోసం అభిమానులే కుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ వారు నిర్మించారు. ఈనెల 28వ తేదీనే విడుదలవ్వాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడంతో చిత్రం వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని హోంబలే వెల్లడించింది. ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుండటంతో అభిమానులు నిరుత్సాహానికి గురైయ్యారు.

ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్‌‌పై భారీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడంతో ప్రభాస్ ఫాన్స్ కు  సలార్‌‌ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ వెరే లెవల్ లో ఉన్నాయి . ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుబోయినట్లు తెలుస్తోంది. టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు పలికినట్లు తెలుస్తోంది. రూ.350 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్‌ను స్టార్ నెట్‌వర్క్, ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. విడుదలకు ముందే రికార్డుస్థాయి వసూళ్లు రాబట్టడంతో సలార్ మూవీపై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. బాహుబలి తరువాత బ్లాక్‌బస్టర్ హిట్ లేని లోటు సలార్ తో తీరుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రాజమౌళి ‘మేడ్ ఇన్ ఇండియా’

Advertisment
తాజా కథనాలు