SS Rajamouli: రాజమౌళి 'మేడ్ ఇన్ ఇండియా' భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ అడుగు వేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'కు శ్రీకారం చుట్టారు. ఆయన సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. By Karthik 20 Sep 2023 in సినిమా New Update షేర్ చేయండి భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ అడుగు వేశారు. 'మేడ్ ఇన్ ఇండియా'కు శ్రీకారం చుట్టారు. ఆయన సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. భారతీయ సినిమాకు పునాది ఎక్కడ పడింది, ఆ తర్వాత ఏ విధంగా ఎదిగింది వంటి విషయాలను సినిమాలో చూపించనున్నారు. ఇండియా సినిమాకు నివాళిగా 'మేడ్ ఇన్ ఇండియా' తెరకెక్కించనున్నారు. కథ, కథనాలతో పాటు విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయని సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ద్వారా అర్థం అవుతోంది. చాలామంది దీన్ని డాక్యుమెంటరీ అనుకుంటున్నారు. కానీ ఇది డాక్యుమెంటరీ కాదని స్పష్టం చేశారు మేకర్స్. ఓ సినిమాటిక్ ఫీల్ ఇచ్చేలా, మేడ్ ఇన్ ఇండియాను తీస్తామంటున్నారు. అంతేకాదు, అవసరమైతే కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటుల్ని తీసుకుంటామని కూడా చెబుతున్నారు. ఇన్నాళ్లూ వెండితెరపై చాలా బయోపిక్స్ చూశామని, కానీ వెండితెరకు జీవంపోసిన సినిమా బయోపిక్ ను తొలిసారి చూపించబోతున్నామని వెల్లడించారు. మాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మరాఠీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ, బయోపిక్ కు సంబంధించి కొన్ని కీలకమైన సలహాలు-సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. ఓవైపు మహేష్ బాబు సినిమాకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు ఈ సినిమాను కూడా పూర్తిచేస్తారు. మహేష్ బాబుతో సెట్స్ పైకి వెళ్లేలేపు, 'మేడ్ ఇన్ ఇండియా' పూర్తవుతుంది. #baahubali #made-in-india #ss-rajamouli #rrr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి