Pushpa 2 -The Rule: ఒకప్పుడు ఏదైనా సినిమా రూ.100 కోట్లు వసూలు చేసిదంటే అందరూ ఆశ్చర్యపోయేవారు. ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే, ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచేది. అయితే ఇప్పుడు సినిమాల బడ్జెట్, కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ఇండియన్ డైరెక్టర్స్ తీసిన కొన్ని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతూ రూ.1000 కోట్లు కొల్లగొడుతున్నాయి. ఈ ట్రెండ్ రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్‌తో ప్రారంభమైంది.అయితే ఒక తెలుగు సినిమా కలెక్షన్ల పరంగా పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఏకంగా వెయ్యి కోట్ల బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా.. అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ కాంబో మూవీ ‘పుష్ప 2’. పుష్ప 1 పాన్ ఇండియా హిట్ అయిన తర్వాత, దీని సీక్వెల్‌పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
Also Read: ఫ్యాన్స్ కు ఊహించని షాక్ ఇచ్చిన నటి.. పెళ్లి పోస్ట్ వైరల్!
సాధారణంగా సినిమా కలెక్షన్స్ విషయంలో, రూ.100 కోట్లకు డొమెస్టిక్ నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరిగణనలోకి తీసుకుంటారు. అయితే రూ.1000 కోట్ల బెంచ్‌మార్క్‌కు వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లెక్కిస్తారు. సాధారణంగా మూవీ రేంజ్‌ను బట్టి ఈ వసూళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు దేశవ్యాప్తంగా వచ్చిన వసూళ్ల కంటే రెండింతలు కూడా ఉండవచ్చు.ఉదాహరణకు దంగల్ సినిమా ఇండియాలో రూ.387 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 2000 కోట్ల క్లబ్‌లో చేరింది. పఠాన్, జవాన్ మూవీస్ కూడా భారతదేశంలో దాదాపు రూ.500-600 కోట్లు సంపాదించాయి, అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు కేవలం ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి.
తెలుగు సినిమా ‘పుష్ప: ది రైజ్’ (2021) దేశ వ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్’ ఈ ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ పెట్టారు., ఈ మూవీ మేకర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే రూ.200 కోట్ల ప్రీ-రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. పుష్ప 1 ఉత్తరాదిలో బ్లాక్‌బస్టర్ అయింది కాబట్టి, హిందీ బెల్ట్‌లో కూడా పుష్ప 2 (Pushpa 2) డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీగా ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా టుడే 2023 రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ.1000 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ లెక్కలు నిజమైతే.. పఠాన్, గదర్ 2, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్స్ ప్రపంచవ్యాప్తంగా సాధించిన నెట్ కలెక్షన్ల కంటే పుష్ప 2 ప్రీ-రిలీజ్ బిజినెస్ ఎక్కువ కావడం విశేషం. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ తదితరులు నటించిన పుష్ప 2 సినిమాకు సుకుమార్ డైరెక్టర్. ఇందులో అల్లు అర్జున్ స్మగ్లర్ పుష్ప రాజ్‌గా నటిస్తున్నాడు.ఈ మూవీ 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ ఏడాది కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ లిస్టులో ప్రభాస్ ‘కల్కి 2898 AD’, సూర్య ‘కంగువ’ వంటి పాన్-ఇండియా మూవీస్, సింగం ఎగైన్ వంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా భారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది.