ఆగస్టు 24న టెలిగ్రామ్ యాప్ చీఫ్ పావెల్ దురోవ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్ వేదికగా జరుగుతున్న నేరాలకు సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. మోసాలకు పాల్పడటం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపులు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలపై ఆయనకు గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. చివరికి ఇలాంటి నేరాలను ఆయన నిరోధించలేకపోయారనే కారణంతో తాజాగా దురోవ్‌ను అరెస్టు చేశారు. దీంతో టెలిగ్రామ్ యాప్ పారదర్శకతపై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా టెలిగ్రామ్ యాప్‌పై దృష్టి సారించింది. ఈ యాప్‌ను వాడుకుని జరుగుతున్న మోసాలు, అక్రమాలు, గ్లాంబ్లింగ్ వంటి నేరపూరిత చర్యలపై ప్రభుత్వం విచారణ చేస్తున్నట్లు పలువురు ప్రభుత్వ అధికారులు ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు.
విచారణలో ఏవైన నేరపూరిత లేదా కీలక విషయాలు బయటపడితే వాటి ఆధారంగా టెలిగ్రామ్ యాప్‌ను దేశంలో బ్యాన్ చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. కేంద్ర హోం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Meity) మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్‌పై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఇండియాలో 50 లక్షల మందికి పైగా టెలిగ్రామ్‌ను వాడుతున్నారు. గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్‌తో పాటు మరికొన్ని యాప్‌లలో స్కామ్స్, నేరపూరిత కార్యక్రమాలు వంటివి జరుగూతనే ఉన్నాయి. వీటిని నమ్ముకొని కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న వినియోగదారులు కూడా ఎంతోమంది ఉన్నారు.
Also Read: రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై..
ఇటీవల భారత్‌లో యూజీసీ నీట్ పేపర్ లీక్ వివాదం జరిగిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి ఈ వివాదంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ నీట్ క్వశ్చన్ పేపర్ లీకైన తర్వాత.. టెలిగ్రామ్ యాప్‌లోనే ఇది విస్తృతంగా షేర్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లోనే నీట్ పేపర్ రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అమ్ముడుపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఐటీ రూల్స్ ప్రకారం.. టెలిగ్రామ్ వంటి యాప్‌లు ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ అధికారిని నియమించుకోవాలి. అలాగే ఈ యాప్‌పై వచ్చే ఫిర్యాదులను, వాటి వివరణలను నెలవారిగా ప్రచురించాలి.
అయితే టెలిగ్రామ్ యాప్‌కు సంబంధించిన కార్యలయాలు భారత్‌లో ఎక్కడా లేవు. వీటి కార్యకలాపాలు ఇక్కడ జరగకపోవడంతో విచారణలో భాగంగా అధికారులకు సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో టెలిగ్రామ్‌పై పర్యవేక్షణ జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలోనే కేంద్ర శాఖ.. టెలిగ్రామ్ అలాగే మరికొన్ని యాప్‌లకు చిన్నారుల లైంగిక వేధింపులు వంటి వాటిని తొలగించాలని ఆదేశించింది. ఈ రూల్స్ పాటించని కొన్ని యాప్‌లను కూడా కేంద్రం బ్లాక్ చేసింది. ఇటీవల ఐటీశాఖ.. ప్రొటాన్ మెయిల్ అనే ఈమెయిల్ యాప్‌ను కూడా బ్లాక్ చేయాలని చేయాలని యత్నించింది. ఈ యాప్‌ను వినియోగించి దేశంలోని పలు స్కూళ్లు, షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్ట్స్ వంటి వాటికి బాంబు బెదిరింపుల మెసెజ్‌లు పంపిస్తున్నాపు. ఈ నేపథ్యంలోనే ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని కేంద్ర ఐటీశాఖ ప్రయత్నించింది. కానీ స్విట్జర్లాండ్ అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవడంతో భారత్.. ఈ యాప్‌ను బ్యాన్ చేయలేకపోయింది.
Also Read: పడవ బోల్తా..13 మంది మృతి!
ఇదిలాఉండగా.. ఇటీవల టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్‌ను అరెస్టు చేయడంతో పలువురు టెక్ దిగ్గజ వ్యాపారవేత్తలు అతనికి మద్దతిస్తున్నారు. మాజీ ఎన్‌ఎస్‌ఓ విసిల్‌బౌలర్.. ఎడ్వర్డ్ స్నోడెన్ ఈ అరెస్టును మానవ భావ ప్రటన హక్కులపై దాడిగా అభివర్ణించారు. అలాగే అమెరికా వ్యాపారవేత్త బాలాజీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. నేరాలను నిరోధించడం కంటే ఫ్రెంచ్ ప్రభుత్వం చర్యలే ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ఇథిరియమ్ సహా వ్యవస్థాపకుడు విటలిక్ విటాలిక్ బుటెరిన్ ఈ అరెస్టుపై స్పందిస్తూ.. యూరప్‌లో భవిష్యత్తు సమాచార స్వేచ్ఛపై ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.