Telangana Elections: కాంగ్రెస్ కు రెబెల్స్ బెడద.. ఆ 12 మంది మాట వింటారా?

కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ టెన్షన్ మొదలైంది. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ పోటీ నుంచి వారిని తప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.

Telangana Elections: కాంగ్రెస్ కు రెబెల్స్ బెడద.. ఆ 12 మంది మాట వింటారా?
New Update

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ రూపంలో ప్రమాదం పొంచి ఉందన్న చర్చ సాగుతోంది. పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నాయకులు ఇండిపెడెంట్ గా ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 12 స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, వారు పోటీలో ఉండడం ద్వారా కాంగ్రెస్ కు పడే ఓట్లు చీలే ప్రమాదం ఉందని హైకమాండ్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. వీరిలో చాలా మంది పోటీ నుంచి తప్పుకునేది లేదని హైకమాండ్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పెద్దలు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ రేపు గడువు ముగిసే సమయానికి రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకపోతే ఆయా స్థానాల్లో ఓట్లు చీలి కాంగ్రెస్ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు సాగుతున్నాయి. రేపు సాయంత్రం ఈ రెబల్స్ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: మోదీ నన్ను బెదిరించారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

12 మంది రెబెల్స్ వీరే..

* సూర్యాపేట - పటేల్‌ రమేష్‌ రెడ్డి

* బోధ్‌ - అశోక్‌, నరేశ్‌ జాదవ్‌లు

* వరంగల్‌ వెస్ట్‌ - జంగా రాఘవరెడ్డి

* ఇబ్రహీంపట్నం - దండెం రాంరెడ్డి

* ఆదిలాబాద్‌ - సంజీవరెడ్డి

* నర్సాపూర్‌ - గాలి అనిల్‌కుమార్‌

* డోర్నకల్‌ - నెహ్రూ నాయక్‌

* జుక్కల్‌ - గంగారం

* బాన్సువాడ - బాలరాజు

* సిరిసిల్ల - ఉమేష్‌రావు

* పాలకుర్తి - లక్ష్మణ్‌నాయక్‌, సుధాకర్‌ గౌడ్‌

#telangana-elections-2023 #congress-rebels #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe