Telangana Election Counting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ డిసెంబర్ 3వ తేదీన జరుగనుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవంబర్ 30న పోలింగ్ జరుగగా.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమై ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు ఎవరినీ రానివ్వకుండా పహారాకాస్తున్నారు.
కాగా, పోలింగ్ కోసం 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఆయా జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కౌంటింగ్ ఉదయం 9 గంటలకు మొదలవనుంది. దాదాపుగా మధ్యాహ్నం లోపు.. ఫలితాలు ఏ పార్టీకి అనుకూలమో తేలిపోతుంది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల వివరాల కోసం కింద పీడీఎఫ్ లో చూడొచ్చు..
Also Read:
చాలారోజుల తర్వాత హాయిగా పడుకున్న.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
40% ఓట్లు వచ్చిన వారికి పవర్.. ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏది?