మూగబోయిన ఉద్యమ గానం..

ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు. ఆయన గానం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి రగిల్చిన ఆ గాత్రం ఆగిపోయింది. గద్దర్‌ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాటకు ప్రజాదరణ లభించింది. బండెనక బండి కట్టి అనే పాటను పాడి..ఆడారు గద్దర్

మూగబోయిన ఉద్యమ గానం..
New Update

ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు. ఆయన గానం మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి రగిల్చిన ఆ గాత్రం ఆగిపోయింది.

➼1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో జన్మించిన గద్దర్
➼గద్దర్ తల్లిదండ్రులు లచ్చమ్మ, శేషయ్య
➼నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో విద్య
➼భావ వ్యాప్తి కోసం ఊరురా తిరిగిన గద్దర్
➼ప్రచారం కోసం బుర్ర కథ ఎచ్చుకున్న ప్రజా గాయకుడు
➼ఆయన ప్రదర్శనను చూసిన దర్శకుడు నరసింగరావు భగత్ సింగ్
➼1971లో ఆపర రిక్షా అనే పాట రాసిన గద్దర్

➼ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్
➼1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గద్దర్
➼2010 వరకు నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర
➼1972లో జన నాట్య మండలి ఏర్పాటు
➼1975లో బ్యాంకు పరీక్ష రాసిన ప్రజా గాయకుడు
➼కెనరా బ్యాంక్‌లో క్లార్క్‌గా చేరిన గద్దర్
➼భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు
➼మా భూమి సినిమాలో.. సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించిన గద్దర్
➼బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి..ఆడిన గద్దర్
➼1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా
➼1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం
➼మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు
➼1990 ఫిబ్రవరి 18న నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభ
➼1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై పోలీసుల కాల్పులు
➼శరీరంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్లు
➼అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులు
➼ఓ బుల్లెట్ తొలగించని డాక్టర్లు
➼ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్
➼గద్దర్‌ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణమా అనే పాటకు ప్రజాదరణ
➼నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు
➼అవార్డును తిరస్కరించిన గద్దర్

#folk-singer-gaddar-death #folk-singer-gaddar #gaddar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe