తుపాన్ల పేర్ల వెనుకాల దాగున్న అసలు రహస్యం..పేర్లేంటి..? ఎలా గుర్తిస్తారు..?

New Update

తిత్లీ, హుద్‌హుద్‌, అంఫన్, మాండూస్‌, యాస్‌.. ఇవన్ని ఏంటి? అని షాక్‌ అవుతున్నారా..? ఇవీ దేశంలో విధ్వంసం సృష్టించిన తుపాన్లుగా ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకున్నాయి. ఇప్పుడేమో బిపోర్‌జాయ్‌ తుపాను.. ప్రజలను భయపెడుతోంది. ఇంతకీ తుపాన్లకు అసలు పేర్లు ఎందుకు పెడతారు? ఎవరు పెడతారు? ఎలా పెడతారు? అనే ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నమవుతున్నాయి. తీరం వైపు దూసుకొస్తున్న తుపాను గురించి చెప్పి ప్రజలను హెచ్చరించేందుకు.. తీరం దాటిన తుపాను మిగిల్చిన నష్టాన్ని గుర్తు చేసుకునేందుకు, ఏ తుపాను ఎంత నష్టం మిగిల్చిందో తేల్చేందుకు తుపాన్లకు పేర్లు అవసరం. అందుకే తుపాన్లకు తిత్లీ, హుద్‌హుద్‌ అంఫన్, మాండూస్‌, యాస్‌, బిపోర్​జాయ్​ లాంటి పేర్లు పెడతారు. అయితే తుపాన్ల పేర్ల వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలను తెలుసుకుందాం....

telanganaandhra-pradeshbharathow-are-cyclones-named-who-names-cyclones-cyclone-names-in-different-countries-biporjoy-cyclone-news

ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు ఉన్నాయి. అలాగే నాలుగు ప్రాంతీయ ఉష్ణ మండల తుపాను హెచ్చరికల కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుపాన్ల గురించి హెచ్చరికలు, సూచనలు జారీ చేయడం.. అలాగే వాటికి పేర్లు పెడుతుంటాయి. ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాల్లో భారత వాతావరణ శాఖ ఒకటిగా పనిచేస్తోంది. ఇది ఉత్తర హిందూ మహా సముద్రంపై గరిష్ఠంగా గంటకు 60 కిలోమీటర్ల ఉపరితల వేగంతో గాలులు వీచే తుపాన్లకు పేర్లు పెడుతుంది. అక్షర క్రమం ఆధారంగా ఒక్కో దేశం ఓ తుపానుకు పేరును సూచిస్తుంది. ప్రతి సారి ఆ పేరు కొత్తగా.. మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలి. పేరు 8 అక్షరాలకు మించరాదు. అది ఏ సభ్య దేశానికీ అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు. ఇలా అన్ని నిబంధనలు పరిగణనలోకి తీసుకున్నాక తుపాన్లకు పేరు పెడతారు.

తుఫాన్​ వల్ల సముద్రంలో ఎగసిపడుతున్న అలలు కొన్ని తుపానుల ప్రభావం వారం కన్నా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే సమయంలో మరో తుపాను వస్తే ఎలా అని ఆలోచించి వాటికి పేర్లు పెట్టడం ప్రారంభించారు. ఒక్కో తుపానుకు ఒక్కో పేరు పెడితే డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది ఫలానా తుపాను అని గుర్తుండిపోతుంది. అంతేకాకుండా ఆ పేరుతో ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంటుంది. ఈ పేర్లు వీలయినంత చిన్నగా, సులభంగా పలికే విధంగా ఉండాలనే నిబంధన ఉంది.

బిపోర్​జాయ్ తుఫాన్ నేపథ్యంలో సముద్రం ఒడ్డున పడవలు తుపాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్ కమిషన్‌ ఫర్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌, ఇంకా వరల్డ్‌ మెట్రలాజికల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్​, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలున్నాయి. ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుపాన్లకు ఈ దేశాలు పేర్లు పెడతాయి. 2018లో ఇరాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్‌ దేశాలు కూడా ఈ గ్రూపులో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్‌ తుపాన్ల పేర్లను నిర్ణయిస్తుంది. ప్యానెల్‌ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్‌ది కాగా, భారత్‌ది రెండో పేరు. ఆ తర్వాత ఇరాన్‌, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్థాన్​, ఖతార్‌ ఇలా కొనసాగుతాయి. తాజాగా గుజరాత్‌ తీరం వైపు దూసుకొస్తున్న తుపానుకు.. బంగ్లాదేశ్‌ 'బిపోర్‌జాయ్‌' అని పేరు పెట్టింది. బెంగాలీలో బిపోర్‌జాయ్‌ అంటే విపత్తు లేదా ఉపద్రవం అని అర్థం వస్తుంది. చూశారు కదా ఇది.. తుఫాన్‌ల పేరు వెనుకాల దాగున్న అసలు నిజం...

Advertisment
Advertisment
తాజా కథనాలు