Staff Nurse: స్టాఫ్‌నర్సుల భర్తీ ప్రక్రియ తుదిదశకు.. రెండు మూడు రోజుల్లో అభ్యర్థులు ఖరారు..
తెలంగాణలో స్టాఫ్‌నర్సుల తుది మెరిట్ జాబితాను విడుదల చేసి రెండు, మూడు రోజుల్లోనే ఇందుకు ఎంపికైన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని బోధనాసుపత్రులతో సహా.. వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో కూడా 7,031 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు.