Madhapur: మాదాపూర్ పోలిస్ స్టేషన్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్ పోలిస్ స్టేషన్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు ఒకేసారి నాలుగు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ మాదాపూర్ పోలిస్ స్టేషన్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. సీజ్ చేసిన సిలిండర్లు ఒకేసారి నాలుగు పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
పోర్టల్ నిర్వహణ బాధ్యతను కేంద్రం అధీనంలో ఉండే ఎన్ఐసీకి అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మొదట రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సీజీజీకి బాధ్యతలు అప్పగించేందుకు చర్చలు జరిగినప్పటికీ, విశ్వసనీయతలో రాజీ పడొద్దన్న ఉద్దేశంతో ఈ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీశ్ రెడ్డి నాపై విమర్శలు చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ జగదీశ్ రెడ్డిని ఎండగట్టారు.
ప్రొఫెసర్ కోదండరాంతో బర్రెలక్క సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల వ్యూహాలతో పాటు నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై చర్చించారు.
బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ మేకల శిల్పా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కార్యదర్శి ఆకుల విజయ, అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆధ్వర్యంలో ఆమె పదవి చేపట్టారు.
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్విట్టర్ ద్వారా ఘాటుగానే స్పందించారు. ఈ పదేళ్లలో యాధికి రాలేదా అంటూ ఎద్దేవా చేసారు.పొన్నం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కవిత సైతం ట్విట్టర్ లో ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు.
టీఎస్ఆర్టీసీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంట్లో బోర్ కొడుతుందని ఇద్దరు మహిళలు బస్సులో ప్రయాణిస్తూ బీడీలు చుడుతున్న వీడియో వైరల్ అవుతోంది. 'హే రేవంత్ రెడ్డి, హే ఉత్తమ్ కుమార్ రెడ్డి, యే క్యా హువా! బస్సుల్లో ఇలా కూడా చేస్తారా' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ అర్హతగలవారు ఫిబ్రవరి 16 వరకూ అప్లై చేసుకోవాలి.