Hyderabad: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ ఘటన.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అతివేగంతో ముందు వెళుతున్న బైక్ ను ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.