Singareni: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయండి.. భట్టి విక్రమార్క ఆదేశాలు
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని సింగరేణి ఎం.డీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు.