రేవంత్ సర్కార్ కు వైసీపీ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు! ఓ టీవీ ఛానల్ ఓనర్ కుటుంబ సభ్యుడు డ్రగ్స్ వినియోగదారులతో మాట్లాడిన డేటా ఇదంటూ.. YCP విడుదల చేసిన లిస్ట్ వివాదాస్పదమైంది. ఎలాంటి కేసులు లేని వ్యక్తి కాల్ డేటాను సైబరాబాద్ పోలీసులు సేకరించడం.. ఓ పార్టీతో పంచుకోవడంతో ఈ వివాదం రేవంత్ సర్కార్ కు చుట్టుకుంది. By Nikhil 24 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి ఈ రోజు మధ్యాహ్నం ఓ ఛానల్ ఛైర్మన్ కుటుంబ సభ్యుడికి డ్రగ్స్ వినియోగదారులతో ఫోన్ సంభాషణలు ఉన్నాయని వైసీపీ ఓ ఫోన్ నంబర్ల లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ తమకు పోలీసుల నుంచి అందిందని వైసీపీ వివరించింది. అయితే ఎటువంటి FIR, కేసుల్లో లేని వ్యక్తుల ఫోన్ వివరాలను సైబరాబాద్ పోలీసులు సేకరించడం, వాటిని వైసీపీ నేతలతో పంచుకుని పబ్లిక్ గా ప్రచురించడం వివాదాస్పదం అయ్యింది. ఓ పక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేస్తున్న రేవంత్ సర్కార్ ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఎలా సమర్ధిస్తుందనేది ప్రధానమైన ప్రశ్న. టెలికాం చట్టం పరిధిలోకి రాదా? మరో 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ నిందితులైన బీఆర్ఎస్ నేతల తాట తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నారు. మరో పక్క పోలీసులు ఎలాంటి కేసుల్లో లేని వ్యక్తుల ఫోన్ సమాచారాన్ని ఎలా సేకరిస్తున్నారు? రాజకీయ పార్టీలకు ఎలా అందజేస్తున్నారు? అవి బహిరంగ వేదికలపై ఎలా పబ్లిష్ చేస్తున్నారు? అనే విషయం వివాదాస్పదమైంది. ఎలాంటి కేసుల్లో లేని వారిపై ఫోన్ నిఘా పెట్టడం, వారి కాల్ డేటా లీక్ చేయడం టెలికాం చట్టం పరిధిలోకి రాదా? అన్నది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సైబరాబాద్ పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. #phone-tapping మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి