యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం

తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్‌లలో పాసయిందని నిర్ధారించారు. దాంతో పాటూ నెయ్య వివరాలను కూడా తెలిపారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది.

author-image
By Manogna alamuru
yadadri
New Update

Yadadri Laddu Ghee: 

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం తెర మీదకు రావడంతో  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాల్లో నెయ్యి మీద పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా యాదాద్రి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినియోగించే నెయ్యిని కూడా ల్యాబ్ టెస్ట్‌కి పంపించారు. ఈ టెస్ట్‌లో యాదాద్రి నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. శాంపిల్స్ తీసుకుని పరీక్షించగా.. నెయ్యి స్వచ్ఛమైనదని నిర్ధారించారు. యాదాద్రికి నెయ్యి ప్రస్తుతం మదర్ డెయిరీ నుంచి వస్తోంది. దీనిని కిలో 609 రూ.లకు కొంటున్నారు. రోజుకు వెయ్యి కిలోల నెయ్యి వినియోగిస్తున్నట్లు యాదాద్రి గుడి నిర్వాహకులు చెప్పారు. ఏడాదిలో సుమారు రూ.15 కోట్ల విలువైన నెయ్యిని మదర్‌ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నాం. అదీ టెండర్‌ ప్రక్రియ ద్వారా గత నలభై ఏళ్లుగా కొనసాగుతోందని ఈవో వివరించారు. అయితే ప్రభుత్వం ఇక మీదట విజయా డెయిరీ నెయ్యి వాడాలని ఇటీవలే ఆదేశాలిచ్చిందని...ప్రస్తుతం ఉన్న టెండర్ అయిపోగానే విజయా డైరీ నెయ్యిని వాడతామని తెలిపారు.  

Also Read: హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్

 

తిరుమల లడ్డూ..

యాదాద్రి లడ్డూ నెయ్యి స్వచ్ఛమైనది అని తేలడంతో ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.  తిరుమల లడ్డూలో వాడుతున్న నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్నది అసలు వివాదం. అది కాకుండా ఇప్పుడు దాని ధర కూడా వివాదానికి కారణం అవుతోంది. యాదాద్రిలో వాడుతున్న విజయా డెయిరీ నెయ్యిని కిలో 609 రూలకు కొంటుంటే...తిరుమలలో వాడే నెయ్యికి కేవలం 350 రూ.లు మాత్రమే చెల్లిస్తున్నారు.  పైగా నెయ్యి కల్తీల్లో తేడా కనిపిస్తోంది. 

Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

ఇప్పుడు యాదాద్రిలో నెయ్యికి ఎక్కువ ధర ఇస్తున్నారు కాబట్టే అది కల్తీ లేకుండా ఉంది. తిరుమలలో చవక నెయ్యి కొంటున్నారు. అందుకే నెయ్యిలో కల్తీ జరుగుతోంది అన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.  నెయ్యి ధర సాధారణంగా అన్ని చోట్లా ఒకేలా ఉండాలి కదా...ఇంత తేడా ఎలా వస్తుందని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ధరను తగ్గించే క్రమంలో నెయ్య క్వాలిటీలో మార్పులు చేస్తున్నారని..జంతుకొవ్వును అందుకే కలిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు నెయ్య రేట్లో ఇంత తేడా ఎందుకు ఉంటూ కనుక్కోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్

ఏఆర్ డెయిరీ

వైసీపీ అధికారంలోకి రాకముందు టీడీపీ హయాంలో తిరుమలలో కర్ణాటక ప్రాడెక్టు నందిని నెయ్యి వవాడేవారు. దాని రేటు కూడా ఇంచుమించుగా విజయా, మదర్ డెయిరీ నెయ్యిలతో సమానంగా ఉంది. అయితే ప్రస్తుతం తిరుమల వాడుతున్న, వివాదానికి కారణం అయిన ఏఆర్ డెయిరీ నెయ్యి మాత్రమే అన్నింటి కంటే తక్కువ రేటుకు వస్తోంది. అన్ని కంపెనీల దగ్గరా ఒకటే రేటు ఉన్న నెయ్యి...కేవలం ఏఆర్ డెయిరీ దగ్గర మాత్రమే ఎందుకు తక్కువకు వస్తుంది అని అడుగుతున్నారు.  మొత్తం అంతా ఒకేలా ఉండా...ఒక్కచోట మాత్రమే రేటు తక్కవు ఉంది అంటే అక్కడ ఏదో కచ్చితంగా మతలబు ఉండే ఉటంఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

Also Read:IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe