/rtv/media/media_files/2025/11/11/naveen-yadav-2025-11-11-08-14-29.jpg)
జూబ్లీహిల్స్ ఓటర్లంతా వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . 2023 అసెంబ్లీ పోలింగ్ తో పోలిస్తే 10 నుంచి 15 శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. 45 నిమిషాల్లోనే ఓ బూత్ లో 60 నుంచి 70 ఓట్లు పోల్ అయ్యాయని అన్నారు. ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని, యువత భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓ టేయాలని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు.
407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రత కోసం 1,761 మంది పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో డ్రోన్లను తొలిసారిగా వినియోగిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఉపఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌లో వెంగళరావు నగర్ పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి MLA భర్త దయానంద్‌పై BRS నేతలు ఆర్వోకి ఫిర్యాదు చేశారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని BRS ఆరోపించింది. మరోవైపు, బోరబండలోని బూత్ 348లో ఈవీఎం మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దే పనిలో అధికారులు ఉన్నారు.
Follow Us