Telangana: అప్పులు తీర్చలేక.. రైలు కింద పడి..

నిజమాబాద్ జిల్లాలో అబంగపట్నానికి చెందిన వినోద్ కుమార్ వీసా రాలేదనే కారణంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు చేసి అతను దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. మెడికల్ ఫిట్‌నెస్‌ లేదని వీసా రిజక్ట్ కావడంతో సూసైడ్ చేసుకున్నాడు. 

Rajasthan: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం..
New Update

నిజమాబాద్ జిల్లా నవీపేట మండలంలో అబంగపట్నానికి చెందిన పల్లే వినోద్ కుమార్ అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జీవనం సాగించడం కోసం ఆరేళ్ల నుంచి వినోద్ దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అతని వీసా గడువు పూర్తి కావడంతో సొంత గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నాడు. మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేయగా.. మెడికల్ ఫిట్‌నెస్ లేదని అధికారులు అతడిని తిరస్కరించారు. దుబాయ్ వెళ్లి రావడానికి అతను దాదాపుగా రూ.6 లక్షలు అప్పుడు చేశాడు.

వీసా రాకపోవడంతో..

వీసా రాకపోవడం, అప్పులు తీర్చడం కష్టమని కుంగిపోయి.. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ రోజే రైలు కింద పడి చనిపోతున్నానని తన సోదరుడు రాజ్‌కుమార్‌కు ఫోన్‌లో చెప్పాడు. సోదరుడు వెంటనే అప్రమత్తమై అతని స్నేహితులతో కలిసి నవీపేట రైల్వే స్టేషన్ సమీపంలో గాలించాడు. ఇంతలోనే రైల్వే‌స్టేషన్ సమీపంలో పట్టాలపై చనిపోయి ఉన్న వినోద్‌ను గుర్తించారు. పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

#suicide
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe