BIG BREAKING : మావోయిస్టులకు బిగ్ షాక్..  లొంగిపోయిన దేవ్‌ జీ

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న అడవి మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పార్టీలో అత్యంత కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యులు, అగ్రనేతలు ఏకంగా 16 మంది పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

New Update
Maoist Devji

తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి చావుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా స్తబ్దంగా ఉన్న అడవి మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. పార్టీలో అత్యంత కీలకమైన సెంట్రల్ కమిటీ సభ్యులు, అగ్రనేతలు ఏకంగా 16 మంది పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇది తెలంగాణ పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్‌లో సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు.

ఈ లొంగుబాటులో అన్నిటికంటే ముఖ్యమైన పేరు దేవ్‌ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. నంబాల కేశవరావు (బసవరాజ్) ఎన్‌కౌంటర్ తర్వాత, మావోయిస్టు పార్టీ పగ్గాలను దేవ్ జీ చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీగా ఉన్న ఈయన లొంగిపోవడం అంటే పార్టీ వెన్నెముక విరిగినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవ్‌ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. దేవ్ జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయారు. ఈయనది కూడా పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రులపల్లి కావడం గమనార్హం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు కూడా ప్రకటించి ఉంది.

కర్రెగుట్టల ప్రాంతాన్ని జల్లెడ

గత వారం రోజులుగా భద్రతా బలగాలు కర్రెగుట్టల ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసుల ఒత్తిడి పెరగడం లేదా అనారోగ్య కారణాల వల్ల వీరు లొంగుబాటుకు మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే, మరో కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ కోసం మాత్రం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అడవిలో ఆయన జాడ కోసం పోలీసులు తీవ్రంగా వేటాడుతున్నారు. వ్యూహాత్మక కారణాల దృష్ట్యా ఈ లొంగుబాటు వివరాలను పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే, మరో రెండు రోజుల్లో వీరిని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ లోపు వారితో ఉన్న ఇతర సంబంధాలు, ప్రస్తుతం పార్టీ స్థితిగతులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ పరిణామంతో ఉత్తర తెలంగాణలో మావోయిస్టు ప్రభావం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాల పాటు పార్టీని నడిపించిన నేతలే బయటకు వచ్చేయడంతో మిగిలిన క్యాడర్‌లో కూడా అయోమయం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు