/rtv/media/media_files/2025/08/12/telangana-heavy-rains-2025-08-12-16-15-42.jpeg)
Heavy Rains
Heavy Rains : రానున్న రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో పరితల చక్రవత ఆవర్తనం కొనసాగుతున్నది. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతున్నది . ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్లగొండ, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లో సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వరదలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటివి జరగవచ్చని అంచనా వేశారు. కాబట్టి ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. వర్షం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఇక జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఆయా జిల్లాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆఫీసులు, ఉద్యోగాలకు వెళ్లిన వారు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.
Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్