Telangana: రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. శనివారం సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్(Mahabub Nagar) , నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.
Also Read:ఇంక ఓపిక లేదు..రేషన్ కార్డుల వ్యవహారంపై సుప్రీం అసహనం
ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి(Wanaparthy), నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ (Yellow Alert) ను జారీ చేశారు. రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించింది.
Also Read: ఐదో రోజు అట్ల బతుకమ్మ..విశిష్ఠతలు ఇవే!
ఆఫీసులకు(Office) వెళ్లే సమయంలో వాన కురవడంతో అటు వాహనదారులు, ఇటు బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బోయిన్‌పల్లి, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్గిరిగుట్ట, మేడ్చల్(Medchal) , కిష్టాపూర్, కండ్లకోయ, దుండిగల్, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, తదితర చోట్ల భారీ వర్షం పడింది.
Also Read: తిరుమల ప్రసాదంలో జెర్రీ!
ఐఎండీ (IMD) ఎప్పటికప్పుడు వర్షాలపై అలర్ట్ చేస్తున్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఏ క్షణం ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నట్టుండి ఆకాశం మబ్బులు కమ్ముతూ, అకస్మాత్తుగా వర్షం కుండపోతగా కురుస్తుంది. ఏదేమైనా బయటకి వెళ్లే వారు కాస్త అప్రమత్తంగా ఉండాలని అటు వాతావరణ శాఖ, ఇటు జీహెచ్ఎంసీ (GHMC) ప్రజలకు సూచిస్తున్నారు.