/rtv/media/media_files/2025/10/06/jubilee-hills-by-poll-2025-10-06-19-46-05.jpg)
Jubilee Hills.. Sensational surveys
Jubilee Hills : జూబ్లీహిల్స్ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీల్లో టెన్షన్‌ను పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ల మధ్య నువ్వా? నేనా? అనేలా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రెండు పార్టీలు రాష్ట్ర ఎన్నికలను మరిపించేలా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు సంస్థలు జూబ్లీహిల్స్ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ ఎన్నికపై ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’, ‘చాణక్య స్ట్రాటజీస్’,‘బిలియన్ కనెక్ట్’, ‘కోడ్‌మో కనెక్టింగ్ డెమోక్రసీ’, ఎస్‌ఏఎస్ గ్రూప్ సంస్థకు చెందిన ‘ఐఐటీయన్ల టీమ్’, ‘ఆర్‌ఆర్ పొలిటికల్’ సర్వే, తాజాగా ‘ఓటా మీడియా హౌస్’, ‘పీపుల్స్ ఇన్‌సైట్’ నిర్వహించిన సర్వేల్లోనూ పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. గడచిన నెలన్నరగా సర్వేలు నిర్వహిస్తు్న్న ఈ సంస్థలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు నిద్రపట్టనివ్వడం లేదు.
గడచిన మూడు ఎన్నికల్లో ఇక్కడి నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. తొలిసారి టీడీపీ నుంచి విజయం సాధించగా అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత రెండు సార్లు కూడా అయన విజయం సాధించారు. మొత్తం మీదా గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అయితే ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు.దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తున్నది.
కాగా మొదటిసారి సెప్టెంబర్‌లో ‘కోడ్‌మో కనెక్టింగ్ డెమోక్రసీ’ అనే సంస్థ టెలిఫోనిక్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 42.8 శాతం మంది బీఆర్‌ఎస్‌కే తమ ఓటు అని ప్రకటించారు. అలాగే గత నెల 10 నుంచి 21 వరకు ‘బిలియన్ కనెక్ట్’ అనే సంస్థ మైనార్టీల అభిప్రాయాలపై ప్రత్యేక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50.5 శాతం మంది మైనార్టీలు బీఆర్‌ఎస్‌కే మద్దతు ప్రకటించారు. ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ అనే సంస్థ జూబ్లీహిల్స్‌లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 30 వరకు విస్తృతస్థాయిలో సర్వే నిర్వహించింది. అందులోనూ బీఆర్‌ఎస్‌కే మద్దతు పలికినట్టు ఈ సర్వే సంస్థ పేర్కొన్నది. ఈ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్100 శాతం గెలిచే అవకాశం ఉందని కేకే సర్వేస్ సీఈవో కిరణ్ కొండేటి తెలిపారు.. ఈ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు 55.2 శాతం మంది ఓటర్లు జై కొట్ట గా, కాంగ్రెస్‌కు 37.8 శాతం మంది ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తెలిపారు. బీజేపీ వైపునకు 7 శాతం మంది ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా ఓటా మీడియా హౌస్ విడుదల చేసిన సర్వేలోనూ కారు దూసుకుపోయినట్టు తేలింది.‘పీపుల్స్ ఇన్‌సైట్’ నిర్వహించిన సర్వేలో బీఆర్‌ఎస్ పార్టీకి 44.03%, కాంగ్రెస్‌కు 39.44%, బీజేపీకి 13.94% ఓటు షేర్ కానున్నట్టు వెల్లడించింది.
‘మూడ్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్’ పేరిట ఆర్‌ఆర్ పొలిటికల్ సర్వేస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్‌పై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.తెలంగాణకు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలన్న ప్రశ్నకు.. కేసీఆరే కావాలని ఏకంగా 66.66 శాతం మంది ఓటర్లు ముక్తకంఠంతో తేల్చిచెప్పగా.. రేవంత్‌కు కేవలం 20.03 శాతం మందే మద్దతు ప్రకటించారు. ఇక చా ణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రీ పోల్ సర్వేలో బీఆర్‌ఎస్‌కు 43 శాతం మంది జూబ్లీహిల్స్ ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తేల్చి చెప్పింది. కాంగ్రెస్‌కు 38 శాతం మంది, బీజేపీకి 10 శాతం మంది ఓట్లు వేయవచ్చని సర్వే సంస్థ అభిప్రాయపడింది. కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్ పార్టీకి 5 శాతం ఓట్లు ఎక్కువగా పోల్ అయ్యే అవకాశం ఉన్నట్టు సర్వే పేర్కొన్నది. హైదరాబాద్‌లోని ఎస్‌ఏఎస్ గ్రూప్‌నకు చెందిన ఐఐటీయన్ల బృందం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. బీఆర్‌ఎస్‌కే తమ ఓటు వేయనున్నట్టు సర్వేలో పాల్గొన్న 46.5 శాతం మంది తేల్చిచెప్పారు.
Follow Us