Agricultural Exhibition Hyderabad: హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యవసాయ ఎగ్జిబిషన్.. ఎక్కడో తెలుసా?

రైతుల కోసం హైదరాబాద్‌ నగరంలో అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.

New Update
FotoJet (98)

The biggest agricultural exhibition in Hyderabad

Agricultural Exhibition Hyderabad: రైతుల కోసం హైదరాబాద్‌ నగరంలో  మూడు రోజుల పాటు అగ్రి షో పేరుతో అతి పెద్ద వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రైతుబడి సంస్థ నిర్వాహకులు రాజేందర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో మూడు రోజుల పాటు ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మూడు రోజుల్లో లక్ష మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

Also Read: రేపే బడ్జెట్.. గ్యాస్, సిగరేట్స్ నుంచి ఫాస్టాగ్ వరకు.. రేపటి నుంచి ఈ ధరల్లో మార్పు?

దేశ, విదేశాలకు చెందిన నూతన వ్యవసాయ సాంకేతికతను వివరించేందుకు 500 కు పైగా కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని రాజేందర్‌ రెడ్డి వివరించారు. నూతన యంత్రాలు, ఏఐ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, విత్తనాలు, మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల వంటివి ఎన్నో ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మూడు రోజుల్లో పలు అంశాలపై సదస్సులు సైతం జరుగుతాయని వివరించారు. సందర్శకులు ముందుగానే www.rbagrishow.com వెబ్ సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని, అలా చేసుకోలేని వాళ్లు నేరుగా వచ్చి టికెట్‌ తీసుకోవచ్చని రాజేందర్‌ రెడ్డి కోరారు.

Advertisment
తాజా కథనాలు