A War Of Love: అది కథ కాదు..నా నిజజీవితం...తన సినిమాపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నామని అన్నారు. డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు.

New Update
Jagga Reddy Movie

Jagga Reddy Movie

A War Of Love: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కథ కాదని తన నిజజీవితాన్ని ఆవిష్కరిస్తున్నానని అన్నారు. మూడు నెలల క్రితం డైరెక్టర్ రామానుజం తనకు చూపిన ఒక ఫొటో చూసి కనెక్ట్ అయ్యానని చెప్పారు. 2013 నుంచి తనలాంటి వ్యక్తి కోసం చూస్తున్నానని.. టైం ఇస్తారా? అని డైరెక్టర్ అడగ్గానే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టైం ఇవ్వలేనని అనుకున్నానని చెప్పారు.

ఇది కూడా చూడండి: Kalyan Ram: విజయశాంతిని అలాగే పిలుస్తా.. అంతగా దగ్గరయ్యాం: కల్యాణ్‌రామ్‌ సంచలనం!


అయితే, ఆ తర్వాత డైరెక్టర్ చూపెట్టిన తన ఫొటో చూసి ఇది ఖచ్చితంగా తను  చేయాలని డిసైడ్ అయ్యానని జగ్గారెడ్డి వెల్లడించారు. 'ఏ వార్ ఆఫ్ లవ్' టైటిల్‌ను డైరెక్టర్ ముందే రాసుకున్నారని తెలిపారు. తన కథకు, లవ్‌కు సంబంధం లేదన్నారు. తన నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని ఆయన చెప్పారు.సినిమా స్టార్ట్ అయినప్పుడు దర్శకుడు ఒక భాగం చెప్పాడని.. మిగితా కథ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నానని జగ్గారెడ్డి తెలిపారు.ఈ సినిమాలో సంగారెడ్డికి చెందిన మొగిలయ్య అనే వ్యక్తి గత18 ఏళ్ల క్రితం రాసిన పాటను ప్రత్యేకంగా విడుదల చేస్తామని జగ్గారెడ్డి వెల్లడించారు.

ఇది కూడా చూడండి: PM Modi: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ

ఈ చిత్రంలో విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్‌గా తన పాత్ర ఉంటుందన్నారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎలా మారాడు అనేది చూపించనున్నామని చెప్పారు. తన సినిమా లవ్, ఫ్యాక్షన్, రాజీకీయ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుందన్నారు. తాను రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా చేస్తున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఇక సినిమా ద్వారా తన రాజకీయ భవిష్యత్ కు ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ పర్యటన తనను పూర్తిగా మార్చేసిందని, ఈ పరిణామాలు ఎటు తీసుకెళ్తాయో తెలియదని అన్నారు. అయితే, తన దృష్టి అంతా సంగారెడ్డి అభివృద్ధిపైనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సంగారెడ్డికి మరిన్ని నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి తన అవసరం అంతగా లేదని అన్నారు.  

ఇది కూడా చూడండి: Lovers suicide : ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు