DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు

డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

DSC
New Update

డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. ఇటీవల డీఎస్సీ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే వందల మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు కూడా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. వాళ్లు ఏదైనా ఒకదాంట్లో చేరితే మళ్లీ వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండిపోతాయి. అందుకే ముందుగా ఎస్‌ఏ విభాగంలో 1:1 నిష్పత్తిలో లిస్టును విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఎస్‌జీటీకి ఎంపికైన వారిది ఇస్తామన్నారు. మొదటి లిస్టులో ఉన్నవారు  రెండో లిస్టులో కూడా ఉన్నట్లైతే ఆ పేరును తొలగించి తర్వాత మెరిట్‌లో ఉన్నవారిని చేరుస్తామని తెలిపారు. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. 

Also Read: మూసీ నిర్వాసితులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉదాహరణకు సిద్దిపేట జిల్లాలో 43 మంది అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యే లిస్టులో ఉన్నారు. అప్పుడు వాళ్లకి డీఈవో ఆఫీస్ సిబ్బంది ముందుగానే ఫోన్ చేస్తారు. ఏ పోస్టు కావాలో డిక్లరేషన్ తీసుకుంటున్నారు. మొత్తంగా 11,062 ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి 1:3 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన శనివారం అర్ధరాత్రి వరకు సాగింది. మరోవైపు ఖాళీ పోస్టులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు కూడా అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని సీఎం రేవంత్‌ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. అలాగే తక్కువ సమయంలోనే డీఎస్సీకి ఎంపికైనవారికి నియామక పత్రాలు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. 

#telangana #dsc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe