PRESS: జర్నలిస్టులకు ట్రాఫిక్ పోలీసులు బిగ్ షాక్ ఇస్తున్నారు. ముప్పు తిప్పలు పడి ప్రజాప్రతినిధుల మీటింగ్‌లు, సమావేశాలు కవర్ చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడూ సమాచారం అందిస్తున్న పాత్రికేయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మీడియా వాళ్లు బండి మీద PRESS అని రాసుకునే హక్కును కూడా పోలీసులు హరిస్తున్నారు.
PRESS అని రాసుకున్నందుకు రూ.700 ఫైన్..
ఈ మేరకు గురువారం హైదారాబాద్ నగరంలో విధులకు వెళ్తున్న ఓ జర్నలిస్టు బండిపై PRESS అని రాసుకున్నందుకు రూ.700 ఫైన్ వేయడం చర్చనీయాంశమైంది. మీడియా సంస్థ ఇచ్చే ID కార్డు, ప్రభుత్వం గుర్తించి ఇచ్చిన అక్రిడేషన్ కార్డు చూపించినా విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు, జాగలు ఇవ్వకపోయినా.. కనీసం బండిమీద మీడియా పర్సన్ అని రాసుకునే స్వేచ్ఛకూడా లేదా అంటూ రేవంత్ సర్కార్ పై మండిపడుతున్నారు. తెలంగాణ సాధనకోసం పలువురు ప్రాణాలు వదిలిన సందర్భాలను గుర్తు చేస్తూ.. జర్నలిస్టులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.