BIG BREAKING: టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా!

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. త్వరలో కొత్త కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. కాగా సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు.

Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్
New Update

Teacher Postings: ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలను సాధించి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నూతన టీచర్లకు భారీ షాక్ తగిలింది. ఈరోజు జరగాల్సిన డీఎస్సీ 2024 పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా మెరిట్ లిస్ట్ ప్రకారం నూతనంగా ఎన్నికైన టీచర్లకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈరోజు పోస్టింగ్ తీసుకున్న వారు..  పాఠశాలలో ఈ నెల 16 నుంచి చేరాల్సి ఉండగా.. పోస్టింగ్ ప్రక్రియ వాయిదా పడింది.

ఇది కూడా చదవండి: మహా ఎన్నికలకు మోగనున్న నగారా!

గందరగోళంలో అభ్యర్థులు...

దసరా పండుగకు ముందు ఉద్యోగాలు వచ్చి.. ఇంటికి వచ్చిన చుట్టాలకు ఈ నెల 16 నుంచి జాయినింగ్ అని చెప్పుకున్న నూతన టీచర్లకు ఊహించని షాక్ తగిలింది. పోస్టింగ్ ప్రక్రియ వాయిదా పడడంతో వారు ఆందోళనలో ఉన్నారు. కారణం చెప్పకుండా ఒకేసారి వాయిదా వేయడంతో వారి భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. కొన్ని కారణాల వల్లే వాయిదా వేశామని.. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు అంటున్న మాట. కాగా రేపటి నుంచి పిల్లలకు పాఠాలు  చెపుదాం అని ఆశలు పెట్టుకున్న అభ్యర్థులకు నిరాశే మిగిలింది. 

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్

మొత్తం 10వేలపైగా... 

ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో కొత్త టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు గానూ 10,006 పోస్టులకు విద్యాశాఖ అభ్యర్థులను ఎంపిక చేసింది. కాగా వారందరికీ ఆ రోజు నియామక పత్రాలు అందాయి. కాగా ఈరోజు పోస్టింగ్ ల ప్రక్రియ జరగనుంది. ఇదిలా ఉంటే కోర్టు కేసులు, ఇతర సమస్యల వల్ల ఇంకా 1056 స్పెషల్ ఎడ్యుకేటర్లు, పీఈటీల పోస్టులు భర్తీ కాలేదని విద్యాశాఖ వెల్లడించింది.

ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్​ పోస్టుల భర్తీకి ప్రభుత్వం DSC నోటిఫికేషన్​ విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు DSC పరీక్షలు పూర్తి అవ్వగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షలు ముగిసిన 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి రేవంత్ సర్కార్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 

ఇది కూడా చదవండి: 
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe