Telangana: అఘోరీ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. సిద్దిపేట సీఐ సంచలన ప్రకటన! సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా అఘోరీ ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అఘోరీ పేరు శివ విష్ణు బ్రాహ్మణి అని తెలిపారు. ఆమె రాత్రి 10 గంటలకు పీఎస్ కు వచ్చినట్లు తెలిపారు. By Nikhil 22 Oct 2024 | నవీకరించబడింది పై 22 Oct 2024 13:54 IST in తెలంగాణ మెదక్ New Update షేర్ చేయండి తెలంగాణలో గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన అఘోరీ సిద్దిపేట పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ మేరకు పలు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై సిద్దిపేట త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ RTVతో ప్రత్యేకంగా మాట్లాడారు. సోమవారం రాత్రి 10 గంటలకు అఘోరీ పోలీస్ స్టేషన్ కు వచ్చిందని తెలిపారు. అఘోరీ పేరు శివ విష్ణు బ్రాహ్మణి అని వెల్లడించారు. సోషల్ మీడియాలో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని అఘోరీ పిటిషన్ ఇచ్చిందని తెలిపారు. అఘోరీ ఫిర్యాదు మేరకు విచారణ చేయనున్నట్లు తెలిపారు. తన పరువుకు భంగం కలిగిందనుకుంటే ఆమో కోర్టులో పరువు నష్టం దావా వేయొచ్చని చెప్పారు. Also Read : ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు తల్లిదండ్రులు ఏం చెబుతున్నారంటే? ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ తల్లిదండ్రులను RTV తాజాగా కలిసింది. ఇందులో భాగంగానే అఘోరీగా ఎందుకు మారాడన్న దానిపై సమాచారాన్ని సేకరించింది. అఘోరీగా ఎప్పుడు మారాడు, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు, అఘోరీ తల్లిదండ్రులెవరు, వారి గ్రామం ఎక్కడ? అనే విషయాలు RTV వెల్లడించింది. మంచిర్యాల జిల్లా నెన్నేల మండలం కుషన్‌పల్లికి చెందిన చిన్నయ్య, చిన్నక్క దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం. అందులో నలుగురు మగ పిల్లలు, ఒక ఆడ పిల్ల. వారిలో అఘోరీగా మారిన ట్రాన్స్‌జెండర్ 3వ కుమారుడు. అతడి అసలు పేరు శ్రీనివాస్. 20 ఏళ్ల కిందటే ఇంటి నుంచి వెళ్లిపోయాడని అఘోరీగా మారిన శ్రీనివాస్ తల్లిదండ్రులు తెలిపారు. Also Read : బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వకు గుండెపోటు ! అంతేకాకుండా వెళ్లిపోయిన తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా, ఆపై అఘోరాగా మారినట్లు వారు చెప్పారు.అయితే ఐదేళ్ల కిందట శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఆశ్వీరాదం తీసుకున్నట్లు వారు తెలిపారు. శ్రీనివాస్ కు సంబంధించిన వివరాలు తెలిపిన అనంతరం RTV ద్వారా తమ కొడుకుతో మాట్లాడారు. మాట్లాడుతుండగా అఘోరీ తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెడుతూ ఇంటికి ఎప్పుడు వస్తావని అఘోరీని అడిగారు. దీంతో అఘోరీ మాట్లాడుతూ.. 'నేను మీ దగ్గరికి రాలేను. నా ప్రాణమైనా పోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి' అని అఘోరీ తన తల్లిదండ్రులకు సూచించింది. Also Read : కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా! Also Read : టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు! #rtv #siddipet #aghori మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి