/rtv/media/media_files/2025/01/02/1BeAzuAVZpGDpsf981BP.jpg)
AP Cabinet Meeting
ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాలనా అంశాలపై సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. ఈ కొత్త సంవత్సరంలో అమలు చేయాల్సిన వివిధ స్కీమ్స్ పై మంత్రులతో చంద్రబాబు మాట్లాడారు. రానున్న అకాడమిక్ ఇయర్ నుంచే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై సైతం సీఎం మంత్రులతో చర్చించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో కలిపి రూ.20 వేలు అందించే అంశంపై సైతం సీఎం చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: AP Jobs: నిరుద్యోగులకు చంద్రబాబు న్యూ ఇయర్ గిఫ్ట్.. భారీ నోటిఫికేషన్స్
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నేడు అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది.#AndhraPradesh pic.twitter.com/ok94kiSJyx
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 2, 2025
రాష్ట్రంలోని మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయంపై కూడా సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఇంకా వారి వేట ఆగిన సమయంలో ఇచ్చే రూ.20 వేల ఆర్థిక సాయంపై కూడా మంత్రులతో సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఈ నెల 8న జరగనున్న పీఎం మోదీ పర్యటనను విజయవంతం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ప్రధాని రోడ్ షో పై కూడా సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెవళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
ప్రతీ తల్లికి నెలకు రూ.15 వేలు..
తల్లికి వందనం స్కీమ్ కింద చదువుకునే ప్రతీ విద్యార్థి తల్లికి నెలకు రూ.15 వేలను చెల్లించనుంది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది. తాజాగా ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించడంతో విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించే అవకాశం ఉంది.