TG: ఆ 10 మందిని ఉద్యోగాల నుంచి తొలగింపు.. పోలీస్ శాఖ సంచలన నిర్ణయం!

తెలంగాణ పోలీసు డిపార్ట్‌ మెంట్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

tg
New Update

Telangana: తెలంగాణ పోలీసు డిపార్ట్‌ మెంట్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆందోళనకు దిగిన పది మంది తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిస్మిస్‌ అయిన వారిలో మూడో బెటాలియన్‌ కు చెందిన కానిస్టేబుల్‌ రవి కుమార్‌, ఆరో బెటాలియన్‌ కు చెందిన కానిస్టేబుల్‌ భూషణ్‌ రావు, 12 వ బెటాలియన్‌ కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ, కానిస్టేబుల్‌ ఎస్‌ కే షఫీ. 17 వ బెటాలియన్‌ కు చెందిన ఏఆర్‌ఎస్సై సాయిరామ్‌ ,కానిస్టేబుళ్లు లక్ష్మీ నారాయణ, కరుణాకర్‌ రెడ్డి, వంశీ, అశోక్‌ , శ్రీనివాస్‌ లు ఉన్నారు.

Also Read: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్

ఈ మేరకు ఏడీజీ సంజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కానిస్టేబుళ్లు పలు జిల్లాల్లో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. అంతకు ముందు పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రోడ్ల పైకి చేరుకుని ధర్నా చేపట్టారు.

Also Read: జన్వాడ పార్టీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు!

దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌ గా తీసుకుంది.ఈ  ఆందోళనకు కారణమైన వారిని, రెచ్చగొట్టిన వారిని గుర్తించి శనివారం 39 మందిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 

Also Read: ఫాంహౌస్ పార్టీపై కేటీఆర్ రియాక్షన్.. అసలు నిజం ఇదేనంటూ!

ఇంతలోనే వీరిలో 10 మందిని ఇప్పుడు పూర్తిగా విధుల నుంచి తొలగించినట్లు టీజీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఏక్ పోలీస్ అంటే ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం తెలంగాణలో 13 బెటాలియన్లు ఉన్నాయి. వాళ్లలో అధికారులు, సిబ్బంది అంతా కలుపుకుంటే ఒక్కో బెటాలియన్‌లో వెయ్యిమంది వరకు ఉంటారు. పోలీస్‌ శాఖలో సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షించడం, నేరాలను విచారించడం, నేరస్తులను గుర్తించడం, క్రైమ్‌ రేటును నిరోధించడం వంటి విధులు సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. అయితే వాళ్లకి బందోబస్తు తదితర విధుల్లో ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు పనిచేస్తుంటారు. ఇక టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది మాత్రం శాంతిభద్రతల విధుల్లో ఉంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్తారు. 

Also Read: అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. వామ్మో వీడియో చూశారా?

అయితే ఈ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లు తమకు ఐదేళ్లలో ఏఆర్‌లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్‌గా మార్చాలని కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర సర్వీస్ నిబంధనలు ఇందుకు ఒప్పుకోవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందని డీజీపీ జితేందర్ ప్రకటన చేశారు. '' తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాలుగా అమల్లో ఉన్నాయి. జిల్లా స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలను నిరోధించడం, క్రిమినల్స్‌ను గుర్తించడం లాంటి విధులు సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. 
 
బందోబస్తు తదితర విధుల్లో ఆర్మ్డ్‌ రిజర్వు పోలీసులు ఉంటారు. ఇక టీజీఎస్పీ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల అంశాల్లో విధులు నిర్వహిస్తుంటారు. అన్ని రాష్ట్రాలు కూడా ఈ విధానాలనే ఫాలో అవుతున్నాయి. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు లేనివిధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు, అడిషనల్ సరెండర్‌ సెలవులు కూడా మంజూరు చేశాం. పండుగలు, సెలవుల సందర్భాల్లో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాం.

జీతాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీసులతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ.. సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళనలు చేపట్టడం సరైంది కాదు. యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే వాళ్లకోసం నిర్వహిస్తున్న దర్బార్ కార్యక్రమం ద్వారా అధికారులకు తెలియజేయాలని'' డీజీపీ వివరించారు.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe