/rtv/media/media_files/2024/10/27/rErf0nwf4mE0VOTWDYDK.jpg)
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మయూర్ పాన్‌షాపు దగ్గరలోని క్రాకర్స్ షాపులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రాకర్స్‌కు అంటుకోవడంతో ఆ మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి.
అబిడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు pic.twitter.com/ujClAOEbiY
— Prashanth (@itzmibadboi) October 27, 2024
ఒక్కసారిగా క్రేకర్స్ కాలుతూ.. చెల్లా చెదురుగా ఎగిరాయి. దాంతో పక్కనే ఉన్న హోటల్‌లో ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం 4 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో 10 వాహనాలు కాలిపోయినట్లు తెలుస్తోంది.