/rtv/media/media_files/2026/01/19/udem-mahipal-reddy-2026-01-19-19-04-36.jpg)
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరికొద్ది రోజుల్లోనే తిరిగి సొంత గూటికి చేరనున్నారా? అంటే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇందులో భాగంగానే తాను కాంగ్రెస్ లో చేరి తప్పు చేశానని ఆయన నిన్న వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గూడెం మహిపాల్ రెడ్డి గత మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. గత ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు రాష్ట్రం మొత్తం ఎదురుగాలి వీచినా ఆయన మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ పార్టీ కీలక నేత హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు గూడెం. ఎన్నికలు జరిగిన ఏడు నెలలకు ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించారు.
అయితే.. చేరిన నాటి నుంచి కాంగ్రెస్ లో వర్గపోరు ఆయనకు తలనొప్పిగా మారింది. మహిపాల్ రెడ్డి మీద కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కాట శ్రీనివాస్ గౌడ్.. మంత్రి దామోదర రాజనర్సింహ సపోర్ట్ తో యాక్టీవ్ గా ఉంటున్నారు. దీంతో మహిపాల్ రెడ్డికి ఇబ్బందులు ఎదరవుతున్నాయి. దీంతో అనేక సార్లు పార్టీ మారి తప్పు చేశానన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మళ్లీ సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ అంటే తమ నేతకు అభిమానమని ఈ నేపథ్యంలోనే క్యాంప్ ఆఫీసులో ఆయన ఫొటో తీయలేదని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో చేరికకు హరీష్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వారు అంటున్నారు.
కేటీఆర్ ఒప్పుకుంటారా?
అయితే.. బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలు తిరిగి వస్తామంటే కేసీఆర్ కాళ్లు మొక్కినా మళ్లీ తీసుకోమని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మళ్లీ చర్చ నీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను కలిసి తప్పయిందని ఒప్పకోవడానికి కూడా తాను సిద్ధమని గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులతో అంటున్నట్లు సమాచారం. ఈ రోజు కేటీఆర్ ను మహిపాల్ రెడ్డి కలుస్తారంటూ చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఓకే అనుకుంటే కేసీఆర్ అపాయింట్మెంట్ దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒక వేళ కేటీఆర్ తన పాత మాటలకే కట్టుబడి ఉంటే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం కష్టం వస్తుంది గూడెం మహిపాల్ రెడ్డికి. లేదంటే పార్టీలోకి రావడం కష్టమేనన్న చర్చ సాగుతోంది.
Follow Us