మంత్రి కొండ సురేఖపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అని ప్రశ్నించారు. తమ పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదన్నారు. ఇదే సోషల్ మీడియాలో తమపై కూడా ట్రోలింగ్ పేరుతో దాడి జరుగుతోందన్నారు. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా? అని అన్నారు. ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? అని ప్రశ్నించారు. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు కావాలంటే పంపిస్తానన్నారు. హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని ఆమె కామెంట్లు చేసిందని గుర్తు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? అని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్లు ఏడ్వరా?? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కావాలంటే పంపిస్తానన్నారు. సీఎం రేవంత్ నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
కోమటిరెడ్డికి మూసీపై అవగాహన లేదు..
మంత్రి వెంకట్ రెడ్డికి మూసీ గురించి అవగాహన లేదని, ఆయనకు ఏం తెలియదని ఫైర్ అయ్యారు కేటీఆర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దమ్ముంటే మూసీ పరివాహాక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఒప్పించాలని సూచించారు. అప్పుడు వెంకటరెడ్డికి మూసీ వద్ద ఉన్న ప్రజలు సన్మానం కూడా చేస్తారన్నారు
మూసీ పైన ఉన్న సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) లపై కూడా వెంకట్ రెడ్డికి తెలియదన్నారు. ఎస్టీపీలు పూర్తి అయిన తర్వాత మూసీలో మురికి నీళ్లు ప్రక్షాళన అవుతాయన్నారు.
హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆటలు..
కేటీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు కొండా సురేఖ. ఆయన మినిస్టర్ గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు. కేటీఆర్ కు తల్లి అక్కా, చెల్లి లేరా? అంటూ ఫైర్ ఆయ్యారు. కేటీఆరే మహిళలను కించపరిచేలా పోస్టులు తన టీమ్ కు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. ఇంకా కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కేటీఆరే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది.
Also Read : ముగ్గురు దొంగలను సింగిల్ హ్యాండ్ తో ఆపిన సూపర్ ఉమెన్!