Viral Video: మంత్రి సురేఖ మంచి మనస్సు.. పేద చిన్నారిని చూసి చలించి..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మంచి మనస్సును చాటారు. రోడ్డు పక్కన చెప్పులు లేకుండా నడుస్తున్న ఓ చిన్నారిని చూసి కారు ఆపారు. ఆ బాలికకు చెప్పులతో పాటు కొత్త బట్టలు కొనిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Minister Konda Surekha

కొండా సురేఖ.. అంటేనే తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనం. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతూ ఎప్పుడూ సీరియస్ గా కనిపిస్తూ ఉంటారు. ఇటీవల కేటీఆర్, సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో అందరికీ తెలిసిందే. దీంతో ఆమెపై కేటీఆర్ తో పాటు నాగార్జున ఫ్యామిలీ సైతం పరువు నష్టం దావాలు వేశారు. వీటిపై ఇప్పుడు న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఇది జరిగిన కొన్ని రోజులకే పరకాలలోని ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేశారు. మంత్రి హోదాలో ఉండి స్టేషన్ కు వెళ్లి పోలీసులను బెదిరించారని ప్రతిపక్షాలు ఆమెపై విమర్శల దాడి చేశాయి.
ఇది కూడా చదవండి: BIG BREAKING: టీడీపీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

కాన్వాయ్ ను ఆపి..

ఇదిలా ఉంటే.. సురేఖ మరో సారి వార్తల్లో నిలిచారు. అయితే.. ఈ సారి వివాదాస్పద వ్యాఖ్యలతోనే, బెదిరింపు ఘటనలతోనో కాదు. ఓ పేద చిన్నారికి ఆయం చేసి.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రోజు మంత్రి కొండా సురేఖ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వరంగల్ నుంచి పెద్దపల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా నడిచి వెళ్తున్న ఓ చిన్నారిని చూసి చలించిన మంత్రి తన కాన్వాయ్ ను ఆపారు. 
ఇది కూడా చదవండి: AP Govt: ఇల్లు కట్టుకునే వారికి చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త!

ఆ పాపను, వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ చిన్నారిని తీసుకుని రోడ్డుకు అవతల వైపు ఉన్న చెప్పుల షాపుకు వెళ్లారు. కావాల్సిన చెప్పులు కొనిచ్చారు. అంతటితో ఆగకుండా ఆ పాపకు బట్టలు కూడా కొనిచ్చి మానవత్వం చాటారు.  దీంతో ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు