ఏడాది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పని తీరే ఇందుకు కారణమన్నారు. కేసీఆర్ పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క ఐదుగురు ఎమ్మెల్యేలతో పోరాటం చేశారన్నారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉన్నాడా? లేడా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
మాతో టచ్ లో 20 మంది ఎమ్మెల్యేలు..
ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు టచ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కోమటిరెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నుంచి మరో 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ తామే వద్దంటున్నామన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కోమటిరెడ్డి RTVతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను పై వీడియోలో చూడండి.