High Court : నోటీసులివ్వకుండా కూల్చివేతలేంటి…హైకోర్టు సీరియస్‌!

అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా...

author-image
By Bhavana
New Update
DSC Postponement: డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలి.. హైకోర్టుకు నిరుద్యోగులు

Telangana High Court :

తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తీసుకువచ్చిన జీవో 99 ను సవాల్​ చేస్తూ హైదరాబాద్ నానక్​రాంగూడకు చెందిన డి.లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్‌లో 19.27 ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. 

Also Read :  వరుణా మళ్లీ వచ్చావా... బంగాళాఖాతంలో అల్పపీడనం

వ్యవసాయ పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం నిర్మించుకున్న నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పోలీసు బలగాలతో వచ్చి కూల్చి వేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నప్పటికీ పట్టించుకోకుండా కూల్చివేతలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం పరిపాలనాపరమైన చర్యల్లో భాగంగా జీవో 99 తీసుకువచ్చిందని, ఇలాంటి ఉత్తర్వులు చట్టాలకు లోబడే ఉండాలన్నారు.

చట్టాలకు విరుద్ధంగా ఇచ్చే పరిపాలనా పరమైన అధికారాలు చెల్లవన్నారు. జీవో 99 ద్వారా జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రాకు అప్పగించిందని, ఇది జీహెచ్ఎంసీ చట్టానికి విరుద్ధమన్నారు.

Also Read :  92 ఏళ్ల తరువాత అరుదైన రికార్డుకు అడుగు దూరంలో!
Advertisment
Advertisment
తాజా కథనాలు