Group1: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్..!

తెలంగాణలో మరి కొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

Group-1 Mains: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. పరీక్ష సమయాల్లో మార్పులు
New Update

Telangana: తెలంగాణలో మరి కొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. పరీక్ష వాయిదా వివాదం నడుస్తున్న వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ మేరకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 

Also Read:  బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌ కి ప్రమాదం..!

ఇప్పటికే పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. పొరపాట్లు లేకుండా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇక గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు హాజరవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణలో బిహార్ ముఠా చోరీలు.. ఏపీలో తెలంగాణ పోలీసుల కాల్పులు

రాష్ట్రంలో 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు జరుగుతుండడంతో.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరిలో 27 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.  ఇక ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. TGPSC కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నుంచి చూడనున్నారు.

Also Read: 2027లోనే జమిలి ఎన్నికలు.. సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం !

అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరు. 1:30 తర్వాత గేట్ క్లోజ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా కేటాయించారు. పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంటుందని అధికారులు ప్రకటించారు. 

వాయిదా వేయాలి...

ఇదిలాఉండగా అక్టోబర్ 21 అంటే సోమవారం నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసందే. ఈ పరీక్షలను వాయిదా వేయాలని ఇటీవల గ్రూప్‌ 1 అభ్యర్థులు అశోక్‌ నగర్, అలాగే సచివాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్రూప్-1 పరీక్షలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించలేదని.. జీవో 29ను రద్దు చేసి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పరీక్షలు వాయిదా వేయడం కుదరని చెప్పేశారు. యథావిధిగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు. 

సుప్రీం లో విచారణ:

ఇదిలా ఉంటే గ్రూప్‌ 1 ఎగ్జామ్‌ పై నడుస్తున్న వివాదం జీవో-29 గురించి సోమవార ఉదయమే సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనుంది. సుప్రీంతీర్పు నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొంది. 

Also Read:  Prabhas మూవీలో హీరోయిన్ ఛాన్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన కరీనా కపూర్

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe