బడ్జెట్ లో కీలక ప్రకటన.. ఆరోగ్యశ్రీలో కొత్తగా 1,835 చికిత్సలు!

పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్‌.  ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచినట్లుగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో  కొత్తగా 1,835 చికిత్సలను చేర్చినట్లుగా వెల్లడించారు.

New Update
aarogyasri card telangana

తెలంగాణ బడ్జెట్ లో పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్‌.  ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచినట్లుగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో  కొత్తగా 1,835 చికిత్సలను చేర్చినట్లుగా వెల్లడించారు. ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చును కూడా 20 శాతానికి పెంచినట్లుగా వెల్లడించారు. ఈ బడ్జెట్ లో  రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం 1,143 కోట్లను కేటాయించింది ప్రభుత్వం.  సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధి చేకూరనుంది. వైద్య రంగానికి సర్కారు రూ. 12 వేల 393 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది. ఇక వైద్య కళాశాలలకు కూడా భారీగా నిధులు కేటాయించింది.  

Also read :  గుడ్ న్యూస్ .. కొత్త రేషన్ కార్డులపై బడ్జెట్ లో కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు