తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ శాఖలో కొత్తగా 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈక్రమంలో మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

New Update

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రెవెన్యూ శాఖలో కొత్తగా 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 10వేల 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఉద్యోగులతో పాటు డైరెక్ట్ రెక్రూట్‌మెంట్‌లో సగం భర్తీ చేశారు. మిగతా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఇది కూడా చూడండి: Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే?

కొత్త ఆర్‌ఓఆర్ చట్టం..

గ్రామ స్థాయిలో విచ్ఛిన్నమైన రెవెన్యూ వ్యవస్థపై సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఇటీవల సమీక్ష నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ పోస్టుల పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఇప్పుడు ఇలా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. 

ఇది కూడా చూడండి: ఊబకాయం ఉన్నవారు జాగ్రత్త.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్‌ఐఎన్‌

#job-notification
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe