HYDRA: హైడ్రా ఇక ఎక్కడికైనా.. కొత్తగా వచ్చిన పవర్స్ ఇవే! నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 పంచాయతీలపై హైడ్రాకు హక్కులు కల్పించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను రెండు రోజుల్లో జారీ చేయాలని కేబినెట్ తీర్మానించింది. By Nikhil 21 Sep 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ లో అక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తోన్న హైడ్రాకు రేవంత్ సర్కార్ ఫుల్ పవర్స్ ఇచ్చింది. హైడ్రాకు చట్టబద్దత లేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపల ప్రాంతం మొత్తాన్ని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. ఓఆర్ఆర్ లోపల ఉన్న మొత్తం 27 మున్సిపాలిటీలు, 51 గ్రామ పంచాయతీలపై హైడ్రాకు పూర్తి హక్కులు కల్పించింది. ఈ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని వివిధ ప్రభుత్వ విభాగాలు, శాఖలకు ఉన్న పవర్స్, హక్కులను హైడ్రాకు కల్పించింది తెలంగాణ కేబినెట్. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే ఆర్డినెన్స్ తీసుకురావాలన్న తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించింది. హైడ్రాకు అధికారాలు కల్పించడంతోపాటు అదనంగా అధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు హైడ్రాకు మరో 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కేటాయించింది తెలంగాణ కేబినెట్. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్ ద్వారా వీరిని కేటాయించనున్నారు. హైడ్రాకు లభించనున్న అధికారాలివే.. హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు హెచ్‌ఎండీఏ చట్టం 2008లోని 8, 23ఏ సెక్షన్ల కింద ఉన్న అధికారాలన్నీ ఇప్పుడు హైడ్రాకు రానున్నాయి. కలెక్టర్, ఆర్డీవోలకు తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని 1317 ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల సంరక్షణ కోసం ఉన్న పవర్స్ ఇప్పుడు హైడ్రాకు రానున్నాయి. కలెక్టర్, నీటిపారుదల శాఖ అధికారికి తెలంగాణ జలవనరుల శాఖ చట్టం 1357ఎఫ్ ద్వారా లభించే పవర్స్ కూడా ఇప్పుడు హైడ్రాకు కలెక్టర్, తహసీల్దార్ కు తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905లో సెక్షన్లు 3, 6, 7, 7ఏ ప్రకారం లభించే పవర్స్ అన్నీ హైడ్రాకు.. జీవోఎంఎస్ 67 ద్వారా 2002లో కల్పించిన పవర్స్ కూడా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కు ఆక్రమణలను పరిశీలించడం, కూల్చివేయడం, నోటీసులు ఇవ్వడం, అనుమతి లేకుండా ఇచ్చిన ప్రకటనలకు ఫైన్లు ఇవ్వడానికి జీహెచ్‌ఎంసీ యాక్ట్ 1955 ద్వారా ఉన్న పవర్స్ కూడా హైడ్రాకు లభించనున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల కమిషనర్లకు తెలంగాణ పురపాలక చట్టం 2019 ప్రకారం ఉన్న అధికారాలను సైత హైడ్రాకు బదలాయించారు. సెక్షన్ 72 ప్రకారం మున్సిపాలిటీలను పర్యవేక్షించేందుక అధికారిని నియమించే అధికారం సైత హైడ్రా కమిషనర్ కు లభిస్తుంది. సెక్షన్ 99 ప్రకారం హైడ్రా కమిషనర్/హైడ్రా సిబ్బంది/హైడ్రా ప్రతినిధికి ఏదైనా ప్రాంగణంలోకి ప్రవేశించి.. సమాచారం తెలుసుకునే అధికారం ఉంటుంది. జలవనరుల రక్షణ, గ్రీనరీ స్థలాలు, వారసత్వ కట్టడాల సంరక్షణ తదతర అధికారులు కూడా హైడ్రా కమిషనర్ కు లభించనున్నాయి హైదరాబాద్ మెట్రో వాటర్‌బోర్డు చట్టం 1989లోని సెక్షన్ 81 ప్రకారం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల సంరక్షణకు అధికారాలు లభించనున్నాయి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ సంరక్షించడానికి హైడ్రా కమిషనర్ చైర్మన్‌గా, కమిషన్ హెచ్‌ఎండీఏ కోచైర్మన్‌గా జీవోఎమ్మెస్ 129 ను జారీ చేసింది ప్రభుత్వం. #hydra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి